తాము అధికారంలో లేకపోతే పిల్లల చదువులు ఉండవని, గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం ఉండదు, 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ కథ దేవుడెరుగు… చివరకు విద్యారంగం కూడా గాలికిపోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వెలిబుచ్చారు. ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, పేదవాడికి ఇంటికే మందులిస్తున్న పథకం, వ్యవసాయం గాలికి ఎగిరిపోతుందని,రైతన్న పూర్తిగా చతికిలబడిపోతాడు, అక్కచెల్లెమ్మల బతుకులు చిన్నాభిన్నం అవుతాయని హెచ్చరించారు. అక్టోబర్-డిసెంబర్, 2023 త్రైమాసికానికి 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ. 708.68 కోట్లను కృష్ణాజిల్లా, పామర్రులో జరిగిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.
* పేదవాడి భవిష్యత్ కోసం యుద్ధం చేస్తున్నది కేవలం మీ జగన్ మాత్రమే
* రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు 9.45 లక్షల మంది పిల్లలకు.. 93 శాతం మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజును మీ జగనన్న ప్రభుత్వమే కడుతోంది.
* ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు వివిధ పథకాల మీద 57 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం పథకాల మీదనే 73 వేల కోట్లు చేశాం.
* గవర్నమెంట్ బడులు మారాలని ఆరాటపడటం తప్పు. ఇంగ్లీషు మీడియం తేవాలని తపన పడటం తప్పు. ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తోంది.
* మనపై యుద్ధం చేస్తున్న వీళ్లు, వీళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు కూడా ఏ మీడియంలో చదువుతున్నారని మీలో ఎవరైనా నిలదీస్తే మాత్రం ఏఒక్కరూ తెలుగుమీడియంలో చదువుతున్నారని చెప్పరు.
* వాళ్ల పిల్లలేమో ఇంగ్లీషుమీడియం చదవాలి, కానీ మన పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవాడానికి మీ జగన్ అడుగులు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించి పోతుందని ఏకంగా యాగీ చేస్తూ మనమీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు.
ఈ రాష్ట్రంలోని పేద పిల్లాడికీ, ప్రతి పాపకూ తల్లిదండ్రులందరూ ఆలోచన చేయాలి
* చంద్రబాబు 14 సంవత్సరాలు 3 సార్లు సీఎంగా పని చేశాడు. పేద వర్గాల పిల్లల గురించి ఆయన చేసిన ఆలోచన ఏమిటి? ఆయన చేసిన మంచేమిటి?
* పేద పిల్లల భవిష్యత్ మార్చాలని మీ అన్న చూపించిన తాపత్రయంలో కనీసం ఒక్క శాతమైనా చంద్రబాబు చూపించాడా? ఆలోచన చేయాలి.
* గవర్నమెంట్ బడిని అదే చంద్రబాబు చేసిందేమిటి? ఆయన చేసిన మంచేమిటి అంటే ఏ ఒక్కరికీ ఏదీ గుర్తుకురాదు.
* కానీ చంద్రబాబు పేరు చెబితే మాత్రం ఆయన విద్యారంగంలో చేసిన చెడు మాత్రం చాలా చెప్పుకోవచ్చు.
* గవర్నమెంట్ బడిని నీరుగార్చింది చంద్రబాబు. నారాయణ, చైతన్య సంస్థల్ని పోషించిన వ్యక్తి చంద్రబాబు.
* అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీషు మీడియం, ఇక్కడ గవర్నమెంట్ బడుల్లో మాత్రం తెలుగు మీడియం. ఇలా నిర్దేశించింది చంద్రబాబు.
* పిల్లలకు గవర్నమెంట్ బడుల్లో ఎలాంటి ఆహారం అందుతుందో కనీసం ధ్యాస పెట్టలేదు.
* బైజూస్ కంటెంట్, పిల్లలకు ట్యాబులు, డిజిటల్ బోధన అంతకన్నా లేదు. నాడునేడుతో స్కూళ్లు బాగుపరచాలన్నది లేదు.
* అమ్మ ఒడి దిశగా అడుగులు వేసింది లేదు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలన్న ఆలోచన ఏరోజూ చేయలేదు.
* ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పరిపాలన వల్ల మంచి జరిగింది ఇదీ అన్నది ఒక్కటంటే ఒక్కటీ లేదు.
* గ్రామంలో, సామాజిక వర్గాలకు, అవ్వాతాతలకు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలు, చదువుకుంటున్న పిల్లలు, జాబుల కోసం వెతుక్కుంటున్న పిల్లలకు ఇది చేశానని చెప్పే పరిస్థితి లేదు.
* ఇలాంటి వ్యక్తులతో యుద్ధం జరుగుతోంది.
* మారీచులతో యుద్ధం చేస్తున్నాం. మంచి చేయడానికి మీ బిడ్డ, మీ అన్న నాలుగు అడుగులు ముందుకేస్తే 8 అడుగులు వెనక్కు లాగాలన్న శక్తులతో యుద్ధం చేస్తున్నాం.
* వాళ్లు చేస్తున్న యుద్ధం కేవలం జగన్ తో కాదు. జగన్ అనే ఒక్కడు పక్కకు తప్పుకుంటే జరిగే నష్టం ఏమిటన్నది ప్రతి ఇంట్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పాప, పిల్లాడు ఆలోచన చేయాలి.
* పేదవాడి భవిష్యత్ కోసం యుద్ధం చేస్తున్నది కేవలం మీ జగన్ మాత్రమే.
* అందుకనే ప్రతి ఒక్కరికీ చెబుతున్నా. వాళ్లు చెప్పే అబద్ధాలు నమ్మకండి. మోసాలు నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు, మోసాలు చెబుతారు.
ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తామంటారు.
* మీ ఇంట్లో ఎవరు మంచి చేశారు, ఎవరి హయాంలో మంచి జరిగిందని ఆలోచన చేయాలి.
* మీ ఇంట్లో మీ జగన్ వల్ల మంచి జరిగి ఉంటే మాత్రం మీ అన్నకు తోడుగా మీరే ప్రతిఒక్కరూ అడుగులు ముందుకు వేయండి, సైనికులుగా నిలబడండి.