Saturday, January 18, 2025
HomeTrending Newsపోలవరం ఇంచు కూడా తగ్గించం: జగన్

పోలవరం ఇంచు కూడా తగ్గించం: జగన్

No Question: పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గదని, ఆ ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై తెలుగుదేశం, ఆ పార్టీకి వత్తాసు పాడే ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని సిఎం తీవ్రంగా ఖండించారు. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర శాసన సభలో జరిగిన స్వల్ప కాలిక చర్చలో సిఎం సమాదానమిచ్చారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు వీరికి ఎవరైనా చెప్పారా? ప్రధాని మోడీ బెడ్ రూమ్ లోకి గానీ, కేంద్ర మంత్రి షెకావత్ బెడ్ రూమ్ లోకి గానీ వెళ్లి  అడిగి వచ్చారా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పోలవరం ఎత్తు తగ్గించేది లేదని కానీ, 2019 నుంచి ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు మాత్రం రోజు రోజుకూ తగ్గిపోతున్నారని వ్యాఖ్యానించారు.  2024 ఎన్నికల్లో  కుప్పంలో కూడా ఓడిపోయిపూర్తిగా మరుగుజ్జుగా మారిపోతారని విమర్శించారు

చర్చ సందర్భంగా సిఎం జగన్ చేసిన వ్యాఖ్యలు:

పోలవరం ప్రాజెక్టును మా హయాంలో పూర్తి చేసి తీరుతాం

మా హయాంలో పోలవరం పూర్తవుతుందని చంద్రబాబుకు కడుపు మంట

నాడు కమీషన్ల కోసం కక్కుర్తిపడి ప్రాజెక్టులు చంద్రబాబు తాను తీసుకున్నారు

2013-14 అంచనాల ప్రకారమే కడతానని హామీ ఇచ్చారు

పోలవరానికి చంద్రబాబు చేసిన పనులే శాపంగా మారాయి

ప్రజలకు మంచి చేశానని చెప్పుకోవడానికి చంద్రబాబు వద్ద ఏమీ లేవు

పోలవరం డిజైన్ ప్రకారం నదిని కుడివైపుకు మళ్ళించాలి

నదిని మళ్ళించడానికి ముందే స్పిల్ వే పెట్టించాల్సి ఉంది

స్పిల్ వే విషయంలోనూ అయన తప్పు చేశారు

స్పిల్ వే కట్టాకే మిగిలినవి  కట్టాల్సి ఉంది

స్పిల్ వే కట్టకుండానే కాఫర్ డ్యాం కట్టేశారు

అందులోనూ 2 కిలోమీటర్ల డ్యామ్ పనులు అసంపూర్తిగా వదిలేశారు

కట్టీ కట్టని స్పిల్ వే ద్వారా వరద నీరు పోయే పరిస్థితి నెలకొంది

బాబు చేసిన పనులతో వరదలు వచ్చినప్పుడల్లా పనులు ముందుకు సాగడం లేదు

దీనివల్ల ఆర్ధికంగా, నిర్మాణపరంగా చాల నష్టం

పోలవరం టూర్ పేరిట రూ. 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు

రెండు కాఫర్ డ్యామ్ లు  పూర్తయ్యాక మధ్యలో మెయిన్ డ్యాం కట్టాలి

కానీ పోలవరం విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నాం

2023ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరుతాం

ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది నాన్నగారు దివంగత వైఎస్సార్

ఇది పూర్తి చేసే బాధ్యత అయన వారసుడిగా నాదే

ప్రాజెక్టు పూర్తయ్యాక డా. వైఎస్సార్ కు అంకితమిస్తాం

 

Also Read : పోలవరం పూర్తి చేస్తాం : కేంద్ర మంత్రి హామీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్