Saturday, November 23, 2024
HomeTrending Newsరాష్ట్రాన్ని కాపాడుకుందాం: బాబు

రాష్ట్రాన్ని కాపాడుకుందాం: బాబు

ఒకప్పుడు శారీరకంగా కష్టపడాల్సి వచ్చేదని, ఇప్పుడు మైండ్ తో ఆలోచన చేస్తే ప్రపంచాన్నే జయించవచ్చని, తాను ఈ విషయాన్ని ఎప్పుడో అలోచించి 20 ఏళ్ళ క్రితమే ఐటి రంగాన్నిఅభివృద్ధి చేశానని  ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు అందరూ ఐటి గురించే ఆలోచిస్తున్నారని, అదే నాలెడ్జ్ ఎకానమీ ప్రత్యేకత అన్నారు. రాష్ట్రంలో ఐటిని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఎన్నో కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  యువత భవిష్యత్ కోసం తాను ఆలోచించానని, అందుకే తాను ఎక్కిడికి వెళ్ళినా యువత పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతు తెల్పుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని, చేతనైతే నాలుగు మంచి పనులు చేయాలని  సవాల్ చేశారు.  బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఆదోనిలో జరిగిన బహిరంగ సభలో ప్రసగించారు.

సిఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చివరి స్థానంలో, అప్పుల్లో మొదటి స్థానంలో ఉందన్నారు. ఆర్ధిక అక్రమార్కుల ఆట కట్టించాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. తాము సంక్షేం- అభివృద్ధి సమపాళ్ళలో చేసి సుపరిపాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. పిల్లల భవిష్యత్ బంగారుమయం చేస్తామన్నారు.  అసెంబ్లీ ఒక కౌరవ సభగా మారిందని, అందుకే మళ్ళీ క్షేత్ర స్థాయిలోకి వెళ్లి విజయం సాధించి దాన్ని గౌరవ సభగా మారుస్తానని, అప్పటిదాకా అసెంబ్లీ అడుగు పెట్టనని చెప్పానని గుర్తు చేశారు.

Also Read : సిఐడి తీరు దారుణం: చంద్రబాబు ఆగ్రహం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్