Saturday, January 18, 2025
HomeTrending Newsదేశవ్యాప్తంగా అల్లూరి జయంతి ఉత్సవాలు

దేశవ్యాప్తంగా అల్లూరి జయంతి ఉత్సవాలు

Alluri: అల్లూరి చరిత్ర, త్యాగం శాశ్వతంగా నిలిచిపోయేలా లంబసింగిలో 35 కోట్ల రూపాయలతో అల్లూరి మ్యూజియం ను ఏర్పాటు చేస్తామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. అల్లూరి తెలుగువాడిగా పుట్టడం మనందరి అదృష్టమన్నారు. ఈ దేశంలో ఉన్న కోట్లాది మందికి అల్లూరి ఘనత ఇంకా తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. నాటి పోరాట యోధుల త్యాగాలను, అమరత్వాన్ని, చరిత్రను భావితరాలకు తెలియజెప్పాల్సిన అవసరం  ఉందని, ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా ఎందరో యోధుల జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. థిర్సా ముండాకు, అల్లూరి సీతారామ రాజుకు దగ్గరి పోలికలుంటాయని పేర్కొన్నారు.

విశాఖపట్నం సీతమ్మధారలో క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు వర్ధంతి కార్యక్రమాలలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా, పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎంవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ జీవితంలో తాను ఎక్కువసార్లు చూసిన సినిమా అల్లూరి సీతారామ రాజు అని కిషన్ రెడ్డి చెప్పారు. తెలుగువారికే పరిమితమైన అల్లూరిని భారతదేశ వ్యాప్తంగా పరిచయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ జూలై 23న మొదలయ్యే అల్లూరి శాత జయంతి ఉత్సవాలు వచ్చే ఏడాది జూలై 4 వరకూ దేశవ్యాప్తంగా…  ఢిల్లీ, హైదరాబాద్, భీమవరం, రాజమండ్రిలో కూడా జరుపుతామని చెప్పారు. భీమవరంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారన్నారు.

అల్లూరి సీతారామరాజు మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి చేసిన కృషి, త్యాగాలను స్మరించుకుంటూ ఆయన వర్ధంతి ఉత్సవాలను జరపడం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాధ్యత అని సందేశాన్ని రాష్ట్ర మంత్రి రోజా అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్