Its not our duty: జైలు అధికారులు నిబంధనల ప్రకారమే ములాఖత్ కు అనిమతిస్తారని అది అధికారుల పరిధిలో ఉన్న అంశమని, దానికి ప్రభుత్వానికి ఏం సంబధమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రశ్నించారు. ఓయూ లో పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి, వాటికి ఆటంకం కలగకూడదనే వీసీ అనుమతి ఇవ్వలేదన్నారు. మహబూబ్ నగర్ లో జేపీ నడ్డా, వరంగల్ లో రాహుల్ సభలకు అక్కడి స్థానిక అధికారులు అనుమతి ఇవ్వలేదా అని అడిగారు. కొన్ని చోట్లా అక్కడి పరిస్థితులు బట్టి సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుంటారని, ప్రభుత్వం తరఫున ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదని తలసాని స్పష్టం చేశారు.

కాగా, నిన్న జరిగిన రైతు సంఘర్షణ కాంగ్రెస్ అంతర్గత సభ లాగా ఉందని ఎద్దేవా చేశారు. మద్దతు ధర ఇస్తామని చెప్పారు కానీ అది రాష్ట్రానికా లేక దేశానికా అన్నది చెప్పలేదన్నారు. దేహ్సాన్ని 40 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎందుకు ఇవ్వలేదని తలసాని సూటిగా నిలదీశారు. రైతులను ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చిందని, దేశంలో ఎన్నో రాష్ట్రాలు తమ రైతు పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయని, కాళేశ్వరంకు  బెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు.  రైతులకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారని, వీరు ఏమైనా స్టడీ చేసి మాట్లాడుతున్నారా లేదా తెలియదని దుయ్యబట్టారు. ఎవరో టూరిస్టుల్లాగా వచ్చి మాట్లాడుతున్నారన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, కేసీఆర్ పోరాడి, చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ సాధించుకున్నారని తలసాని వ్యాఖ్యానించారు.

Also Read : తెరాసతో పొత్తు ఉండదు – రాహుల్ గాంధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *