విద్యార్ధి నేతలకు రాహూల్ ఓదార్పు

Rahul_NSUI leaders: చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న NSUI నేతలను కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ పరామర్శించారు. రాహుల్ వెంట ఒక్క మల్లు భట్టి విక్రమార్కనే అనుమతించారు. దామోదరం సంజీవయ్య విగ్రహానికి నివాళులు అర్పించిన అనతరం నేతలతో కలిసి చంచల్ గూడ చేరుకున్నారు.  తొలుత ముగ్గురికి అనుమతిస్తామని చెప్పిన పోలీసు అధికారులు చివరకు ఇద్దరినే అనుమతిస్తామని… రాహుల్ తో పాటు మరోక్కరిని మాత్రమె లోపలకు పంపుతామని చెప్పారు. దీనితో రాహుల్ వెంట మల్లు  లోపలి వెళ్ళారు. NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తో పాటు ఇతర విద్యార్థి నేతలను వారు కలుసుకొని మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.

రాహుల్ ఓయూ పర్యటనకు అనుమతి అడగడానికి వెళ్ళిన విద్యార్థి నేతలపై అక్రమ కేసులు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. చంచల్ గూడ లో వారిని నిర్బంధించారన్నారు. 18 మంది విద్యార్థి నేతలు జైల్లో ఉన్నారని వారిలో ఒక్కోకరినీ ముగ్గురు చొప్పున 54 మంది వరకూ వారితో ములాఖత్ కావచ్చని, పార్లమెంట్ సభ్యులుగా తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడైనా జైల్లోకి వెళ్ళొచ్చని అయితే కేసిఆర్ ఒత్తిడితో కేవలం ఇద్దరినే అనుమతించారని రేవంత్ మండిపడ్డారు.

Also Read : తెరాసతో పొత్తు ఉండదు – రాహుల్ గాంధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *