తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెరాస దుష్ట పాలన నుంచి ప్రజలకు కాంగ్రెస్ పార్టీనే విముక్తి కలిగిస్తుందని, కాంగ్రెస్ బలోపేతం కోసం రాష్ట్రానికి వచ్చే ననెలలో   రాహుల్ గాంధీ వస్తున్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో పొత్తు కోసం కెసిఆర్… కాంగ్రెస్ తో పొత్తు అడిగినా కాంగ్రెస్ అధిష్టానం వద్దు అని చెప్పిందన్నారు.  ప్రశాంత్ కిషోర్ నీ కూడా తెలంగాణ గురించే అధిష్టానం వద్దని చెప్పిందని కోమటిరెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో వెల్లడించారు.

గజ్వేల్…సిరిసిల్ల..సిద్దిపేట కె కెసిఆర్ సీఎంగా వ్యవహరిస్తున్నారని కోమటిరెడ్డి ఘాటుగా విమర్శించారు. మిగిలిన జిల్లాలకు కెసిఆర్ సీఎంగా వ్యవహరించటం లేదని ఆరోపించారు. శ్రీశైలం ఎడమ కాలువ (Slbc) పనులు ఎందుకు పూర్తి చేయటం లేదని ప్రశ్నించారు. కెసిఆర్… ఎందుకు నల్గొండ జిల్లా మీద కక్ష కట్టావు, కాంగ్రెస్ హయంలో  90 శాతం పనులు చేసిన ప్రాజెక్టులు ఏమయ్యాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీనీ తిట్టడానికి తెరాస ప్లీనరీ పెట్టారని, తొమ్మిది యేండ్ల లో dsc నోటిఫికేషన్ ఎందుకు  ఇవ్వలేదని మండిపడ్డారు. మోడీ..కెసిఆర్ ఇద్దరు ట్యాక్స్ లు వేస్తున్నారని, ఇష్టారాజ్యంగా ట్యాక్స్ లు వేసుకుని జనం నీ దోచుకుంటున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  దుయ్యబట్టారు.

Also Read : టీఆర్ఎస్- కాంగ్రెస్ రెండూ ఒక్కటే-డీకే అరుణ  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *