Friday, November 22, 2024
Homeతెలంగాణకోవిడ్ చికిత్సకు కంటోన్మెంట్ ఆస్పత్రి: కిషన్ రెడ్డి

కోవిడ్ చికిత్సకు కంటోన్మెంట్ ఆస్పత్రి: కిషన్ రెడ్డి

బొల్లారం లోని కంటోన్మెంట్ ఆసుపత్రిని కోవిడ్ చికిత్స కోసం వినియోగిస్తామని కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ కార్యదర్శితో మాట్లాడి నిధులు సమకూరుస్తానని యామి ఇచ్చారు. కంటోన్మెంట్ ఆసుపత్రిని కిషన్ రెడ్డి సందర్శించారు. వాక్సినేషన్ సెంటర్, కోవిడ్ ఆస్పత్రిగా మార్చడం కోసం చేపడుతున్న ఏర్పాట్లు పరిశీలించారు.
కోవిడ్ రెండో దశ ఉత్పాతం లాగా వచ్చిందని. దీన్నుంచి బైటపడటానికి త్రివిధ దళాలు, పారా మిలటరీలో రిటైర్డ్ అయిన వైద్య సిబ్బంది సేవలు వినియోగించుకున్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు.
వైద్యవిద్య అభ్యసిస్తున్న విద్యార్ధుల సేవలు ఉపయోగించుకొని భవిష్యత్ ఉద్యోగాలలో వారికి వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించామని… యువతకి 15 రోజులు ప్రత్యెక శిక్షణ ఇచ్చి వారిని కోవిడ్ సేవల కోసం ఉపయోగించుకోవాలనే ఆలోచన వుందని కేంద్రమంత్రి వెల్లడించారు. ప్రజల సహకారం లేనిదే ఈ మహమ్మరిని అరికట్టలేమన్నారు
దేశంలో కేవలం 49 వేలు మాత్రమే ఉన్న వెంటిలేటర్స్ ను, ఈ 9 నెలల్లో 51 వేలు అదనంగా తయారుచేసి వినియోగిస్తున్నామని చెప్పారు. వీలైతే సేవ చేయండి సలహాలు ఇవ్వాలి కానీ పనిచేసే ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేసి అడ్డంకులు సృష్టించొద్దని హితవు పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్