ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని వసతులు కల్పించండని మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. పీపీసీల్లో మౌలిక వసతులు, సరిపడ గన్నీలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో రూ.3.50 కోట్లతో నిర్మించిన TS BC స్టడీ సర్కిల్ భవనాన్ని మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఆ తర్వాత వైరా లో కొనుగోలు కేంద్రం పనితీరు పరిశీలించిన మంత్రి భద్రాద్రి కొత్తగూడెంలో ధాన్యం కొనుగోళ్ళపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ తెలంగాణ రైతులపై కక్షతో కేంద్రం ఈసారి రా రైస్ ఇవ్వమంటున్నారన్నారు. యాసంగిలో పెరిగే broken పర్సంటేజీతో జరిగే నష్టాన్ని భరించి సీఎం కేసీఆర్ ధాన్యం సేకరిస్తున్నారని, కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తామని మంత్రి గంగుల భరోసా ఇచ్చారు.
అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో సేకరణలో నిమగ్నం అవ్వాలని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనుగోల్లు సజావుగా, అద్భుతంగా జరుగుతున్నాయని మంత్రి కితాబు ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో 36,171 మెట్రిక్ టన్నులు సేకరణ, 21.20 లక్షల గన్నీలు అందుబాటులో ఉన్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8043 మెట్రిక్ టన్నులు సేకరణ, 9 లక్షల గన్నీలు అందుబాటులో నతాయని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, ఎమ్మెల్సీ తాత మధు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రెండు జిల్లాల కలెక్టర్లు వి.పి గౌతమ్, దురిశెట్టి అనుదీప్, అదనపు కలెక్టర్లు మధుసూదన్, వెంకటేశ్వరరావు రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, సివిల్ సప్లై కార్పొరేషన్ జిఎం రాజారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : సజావుగా ధాన్యం సేకరణ -మంత్రి గంగుల