Thursday, March 28, 2024
Homeసినిమాజూలై 8న నాగ‌చైత‌న్య 'థ్యాంక్యూ'

జూలై 8న నాగ‌చైత‌న్య ‘థ్యాంక్యూ’

July: అక్కినేని నాగ‌చైత‌న్య ‘మ‌జిలీ’, ‘వెంకీమామ‌’, ‘ల‌వ్ స్టోరీ’, ‘బంగార్రాజు’.. ఇలా వ‌రుస‌గా స‌క్సెస్ సాధిస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నాడు. నాగ‌చైత‌న్య తాజా చిత్రం థ్యాంక్యూ. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది.

జూలై 8వ తేదీన ‘థ్యాంక్యూ’ విడుదల చేయనున్నట్టుగా ఈరోజు అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. అంతే కాకుండా.. సినిమాకి సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చైతు డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. చైతు సరసన నాయికలుగా రాశి ఖన్నా,  మాళవిక నాయర్, అవికా గోర్ న‌టించారు. విభిన్న క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ సంగీతం అందించారు.

త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ అండ్ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమాలో చైత‌న్య ముగ్గురు హీరోయిన్స్ తో న‌టించ‌డం విశేషం. మ‌రి.. వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న చైత‌న్య థ్యాంక్యూ మూవీతో మ‌రో స‌క్సెస్ సాధిస్తారేమో చూడాలి.

Also Read : అక్కినేని నాగ‌చైత‌న్య ‘థాంక్యూ’ చిత్రీకరణ పూర్తి 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్