Friday, March 29, 2024
HomeTrending Newsఅవన్నీ అసత్య కథనాలు : గుంటూరు జడ్పీ ఛైర్మన్

అవన్నీ అసత్య కథనాలు : గుంటూరు జడ్పీ ఛైర్మన్

Not Correct: తన భర్తపై అసత్య కథనాలు ప్రచురించారని, ఈనెల 9వ తేదీనే ఆయన విదేశాలకు వెళ్ళారని,  రెండ్రోజుల క్రితం ఆయన్ను అరెస్టు చేశారంటూ  తప్పుడు వార్తలు ప్రచురించారని గుంటూరు జడ్పీ ఛైర్మన్ కత్తెర క్రిస్టినా ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 27న  తమ కుమారుడి వివాహం జరిగిందని, దానికి వచ్చిన తన భర్త ఈనెల 9న విదేశాలకు తిరిగి వెళ్ళారని వివరించారు.  ప్రతిసారీ తన భర్తపై అసత్య వార్తలు ప్రచురిస్తున్నారని, తన పేరు ప్రస్తావించి మరీ రాస్తున్నారని ఆమె వాపోయారు.

స్వచ్చంద సంస్థల పేరిట విదేశీ నిధులు దారి మళ్లించిన కేసులో హార్వెస్ట్ ఇండియా సొసైటీ అధ్యక్షుడు కత్తెర సురేష్ కుమార్ ను సిబిఐ  అరెస్టు చేసినట్లు నిన్న ఓ దినపత్రిక వార్తను ప్రచురించింది.  ఈ వార్తను ఖండిస్తూ కత్తెర క్రిస్టినా  గుంటూరు జడ్పీ సమావేశ మందిరంలో నేడు మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కేసులో కొంతమంది అరెస్టయ్యారని, అందులో తన భర్త లేరని….  అయినా గుంటూరు జడ్పీ ఛైర్మన్ భర్త అరెస్ట్ అంటూ వార్త రాయడం సమంజసం కాదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలతో పేదలను ఆదుకుంటోన్న సిఎం జగన్ నేతృత్వంలో తాము రాజకీయాల్లో పనిచేస్తున్నామని… ఇలాంటి వార్తలు ఎవరిని దెబ్బతీయడానికి రాస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తనను ఎందుకు వివాదాల్లోకి లాగుతున్నారని ఆమె ప్రశ్నించారు. మరోసారి తనపై ఇలాంటి వార్తలు రాస్తే  ఊరుకునే ప్రసక్తే లేదని…. న్యాయాన్ని, చట్టాన్ని ఆశ్రయిస్తానని హెచ్చరించారు.

మిగతా సంస్థలకు చేసినట్లే తమ హార్వెస్ట్ ఇండియాకు కూడా .  ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్ సి ఆర్ ఏ) కింద మూడేళ్ళ క్రితమే లైసెన్స్ రద్దు చేసిందని…..  అంతకుముందు కూడా తాము ఓ పద్దతి ప్రకారమే సేవా కార్యక్రమాలు చేశాము తప్ప ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని ఆమె స్పష్టం చేశారు. ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ రెన్యువల్ కోసం  తాము దరఖాస్తు పెట్టామని అది పరిశీలనో ఉందని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్