Monday, June 3, 2024
Homeసినిమాథ్యాంక్యూ రిలీజ్ డేట్ ఖరారు కాలేదా?

థ్యాంక్యూ రిలీజ్ డేట్ ఖరారు కాలేదా?

No Thank You: అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ‘. ఈ చిత్రానికి మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విభిన్న క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా గురించి అభిమానులు ఎప్ప‌టి నుంచో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఎప్పుడో స్టార్ట్ చేసింది. ఫ‌స్ట్ కాపీ రెడీగా ఉంది. భారీ చిత్రాలు వ‌రుస‌గా రిలీజ్ అవుతుండ‌డంతో థ్యాంక్యూ రిలీజ్ ఆల‌స్యం అయ్యింది.

అయితే.. ఇటీవ‌ల థ్యాంక్యూ మూవీ రిలీజ్ డేట్ క‌న్ ఫ‌ర్మ్ అయ్యింద‌ని.. జులై 7న సినిమా రిలీజ్ అని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో రిలీజ్ డేట్ క‌న్ ఫ‌ర్మ్ అనుకున్నారు సినీ జ‌నాలు. తాజా వార్త ఏంటంటే.. ఇంకా రిలీజ్ డేట్ క‌న్ ఫ‌ర్మ్ చేయ‌లేదట‌. దిల్ రాజు ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్నారు. అక్కడ నుంచి వ‌చ్చిన త‌ర్వాత థ్యాంక్యూ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఫైన‌ల్ చేస్తార‌ని తెలిసింది. జులై 7న కుద‌ర‌క‌పోతే.. జులై 21న విడుద‌ల చేయాలి అనుకుంటున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

Also Read : చైత‌న్య వెబ్ సిరీస్ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్