We Will Win In Nellore Corporation Also Says Sajjala :

బద్వేల్ ఫలితం స్పూర్తితో నెల్లూరు కార్పొరేషన్ ను కూడా ఏకపక్షంగా కైవసం చేసుకుంటామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిఎం జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ  చేస్తున్న కుట్రలు, కుంతంత్రాలను తిప్పికొట్టాలని అయన పిలుపు ఇచ్చారు. తప్పుడు ఆరోపణలు చేయడం టిడిపికి అలవాటుగా మారిందని మండిపడ్డారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికలకు మొన్న నవంబర్ 1న  నిన్న షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా నెల్లూరు నగర పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తో కలిసి సజ్జల పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. టిడిపి ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే భయపడే స్థాయికి చేరుకుందని, అయితే పోటీలో లేకపోయినా కుట్రలు చేస్తూ ఎల్లో మీడియా ద్వారా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. నెల్లూరులో మొత్తం 54 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంటుందని బాలినేని విశ్వాసం వ్యక్తంచేశారు.

Must Read :ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *