Sunday, January 19, 2025
HomeTrending Newsకుప్పంలో ఎగిరేది మా జెండానే: రెడ్డప్ప

కుప్పంలో ఎగిరేది మా జెండానే: రెడ్డప్ప

We Will Win Kuppam Municipality With Landslide Majority Chittoor Mp Reddappa :

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులూ తామే గెలుస్తామని వైఎస్సార్సీపీ నేత, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ఓడిపోతే ఇకపై కుప్పంలో అడుగు పెట్టబోమని సవాల్ చేశారు. చంద్రబాబు ఓడిపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తారా అని నిలదీశారు. కుప్పం ప్రజలపై చంద్రబాబుకు నమ్మకం లేదని, అందుకే ఇక్కడ ఇల్లు గానీ, ఓటు హక్కు గానీ లేదన్నారు.

కుప్పంలో ఎగరబోయేది వైసీపీ జెండా మాత్రమేనని, సిఎం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, తమ పార్టీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు.  పుంగనూరు పుడింగి అంటూ  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రెడ్డప్ప ప్రస్తావిస్తూ ‘ అవును పెద్దిరెడ్డి పుడింగే.. కుప్పం ఎన్నికల్లో మరోసారి దీన్ని నిరూపిస్తామ’ని  వ్యాఖ్యానించారు. టిడిపి పెద్దఎత్తున నాయకులను మొహరించిందని అన్నారు. అయితే తమ పార్టీకి కార్యకర్తలే నాయకులని, కుప్పం ప్రజల ఆశీస్సులు తమకే ఉన్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

కాగా నేడు కుప్పంలో జరిగే ఎన్నికల బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొననున్నారు.

Must Read :కుప్పంలో చంద్రబాబు పర్యటన

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్