Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

5000 Translation Results The Rule Of Chief Minister Mk Stalin In Tamil Nadu In An Innovative Way :

తమిళనాడు సీఎం స్టాలిన్ అధికారం చేపట్టిన రోజు నుంచి వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. అధికారుల్లో భాద్యత పెంచేలా పని చేయిస్తున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకుండా.. పాలన సాగిస్తున్నారు. తాజాగా ఆయన చెంగల్పట్టు జిల్లాలో పర్యటించారు. నేరుగా ఓ మహిళ ఇంటికెళ్లి ప్రభుత్వ పధకాల అమలుపై ఆరా తీశారు. ఇంటింటికి వెళ్లి సౌకర్యాలపై ఆరా తీసి, అర్జీలు స్వీకరించారు.

ప్రభుత్వ పనితీరుపై ఉదయం వాకింగ్ చేస్తూ ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.  ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీ సముదాయంలో భోజనశాలను మూయించి వేశారు. ఇక నుంచి అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు వారి వారి ఇంటి నుంచే భోజనాలు తీసుకు రావాల్సి ఉంటుంది. స్టాలిన్ చర్యలు మూలంగా అసెంబ్లీ సమావేశాలు సక్రమంగా సమయం వృధా కాకుండా జరగటంతో పాటు ప్రభుత్వ ఖర్చులు బాగా తగ్గుతుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Must Read :నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com