Friday, March 13, 2026
Homeస్పోర్ట్స్తొలి టి20లో విండీస్ విజయం

తొలి టి20లో విండీస్ విజయం

ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో వెస్టిండీస్ 9 వికెట్లతో  ఘన విజయం సాధించింది. బార్బడోస్, బ్రిడ్జి టౌన్ లోని కెన్సింగ్ టన్ ఓవల్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ టాపార్డర్ ఘోరంగా విఫలం కావడంతో 19.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జట్టు మొత్తంలో క్రిస్ జోర్డాన్-28; ఆదిల్ రషీద్-22 మాత్రమే రాణించారు. విండీస్ బౌలర్లలో హోల్డర్ నాలుగు వికెట్లతో రాణించాడు. కట్రెల్ రెండు; అకేల్ హుస్సేన్, రోమానియో షెఫర్డ్, ఫబియన్ అలెన్ తలా వికెట్ పడగొట్టారు.

వెస్టిండీస్ 104 పరుగుల విజయ లక్ష్యాన్ని ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 17.1 ఓవర్లలోనే సాధించింది. ఓపెనర్ హోప్ 20 పరుగులు చేసి ఔట్ కాగా, మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్-52; నికోలస్ పూరన్-27 పరుగులతో అజేయంగా నిలిచారు.

హోల్డర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

ఐదు టి20లు,  మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్ లో పర్యటిస్తోంది.  ఇటీవలే స్వదేశంలో ఐర్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను కోల్పోయిన వెస్టిండీస్ కు తాజా విజయం కొంత ఊరట ఇచ్చిందని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular