మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇండియా- వెస్టిండీస్ మధ్య బార్బొడోస్ లో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య విండీస్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 40.5 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని విండీస్ 36.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి సాధించింది.
ఈ మ్యాచ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. వీరి స్థానంలో సంజూ శామ్సన్, అక్షర్ పటేల్ ను జట్టులోకి తీసుకున్నారు.
ఇండియా తొలి వికెట్ కు 90 పరుగులతో శుభారంభం చేసింది. శుభ్ మన్ గిల్ 34 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ కాసేపటికే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీ (55)తో రాణించి వెనుదిరిగాడు. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే 24 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లు సమిష్టిగా రాణించి ఇండియాను కట్టడి చేశారు. మోతీ. రోమానియో షెఫర్డ్ చెరో మూడు. అల్జారీ జోసెఫ్ 2, జేడెన్ సీల్స్. కరియా చెరో వికెట్ పడగొట్టారు.
విండీస్ 53, 54 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. బ్రాండన్ కింగ్-15, కేల మేయర్స్-36 రన్స్ చేసి ఔటయ్యారు. అత్నాంజే (6); హెట్ మెయిర్ (9) విఫలమయ్యారు. ఈ దశలో కెప్టెన్ షాయ్ హోప్-కీసీ కార్టీలు ఐదో వికెట్ కు అజేయంగా 91 పరుగులు జోడించి గెలిపించారు. హోప్ 63; కార్టీ -48 స్కోరు చేశారు.
ఇండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3; కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ సాధించారు.
హోప్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.