Saturday, November 23, 2024
HomeTrending Newsఇంతకీ ఎవరీ ఏకనాథ్ షిండే?

ఇంతకీ ఎవరీ ఏకనాథ్ షిండే?

Eknath Shinde : ఒక కాలేజ్ డ్రాప్ అవుట్ విద్యార్ధి ! ఆటో డ్రైవర్ ! పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలోని సతారా జిల్లా వాస్తవ్యుడు ఏకనాథ్ షిండే. మొదటి నుంచి బాల్ థాకరే కి వీరాభిమా… కానీ ఏకనాథ్ షిండే రాజకీయ గురువు మాత్రం ఆనంద్ దిఘే ! ఆనంద్ దిఘే ఏకనాథ్ షిండే ని రాజకీయాలలోకి ఆహ్వానించాడు అలాగే రాజకీయం అంటే ఏమిటో దానిని ఎలా వంట పట్టించుకోవాలో దగ్గరుండి మరీ చూపిస్తూ నేర్పించాడు. ఆనంద్ దిఘే 2001లో అకాల మరణం చెందాడు. తన రాజకీయ గురువు చూపించిన మార్గాన్ని వీడలేదు ఏకనాథ్ షిండే !
తన జీవన భృతి కోసం ఆటో నడుపుతూనే శివసేనతో ప్రత్యక్ష్య రాజకీయాలలో కొనసాగాడు. బాల్ థాకరే సిద్ధాంతం అయిన హిందూ భావజాలం మాత్రం ఏకనాథ్ షిండే ని బాగా ప్రభావితం చేసింది ఎంతలా అంటే తాను ఆటో డ్రైవర్ అయినా సరే ఎక్కడా తగ్గేవాడు కాదు. ఎక్కడన్నా హిందూ భావజాలాన్ని ఎవరన్నా తూలనాడితే సహించేవాడు కాదు. అలా ఏకనాథ్ షిండే చాలా ఉద్రేకంగా ఉండేవాడు హిందూ భావజాలంతో అదే అతనిని క్రమంగా ఒక నాయకుడిగా నిలబెట్టింది.
ఏకనాథ్ షిండే మీద మొత్తం 14 క్రిమినల్ కేసులున్నాయి. ఆ కేసులన్నీ హిందూత్వ భావజాలం ఆధారంగా చాలా ఉద్రేకంగా చేసిన పనుల వల్ల నమోదు అయినవే ! చివరకి బాలా సాహెబ్ ఠాక్రె ఉన్న సమయంలో కర్ణాటక,మహారాష్ట్ర ల మధ్య బెల్గాం సరిహద్దు విషయంలో చెలరేగిన ఆందోళనలో కర్ణాటక పోలీసులు ఏకనాథ్ షిండే ని అరెస్ట్ చేసి బళ్ళారి జైల్లో పెట్టారు.

ఉద్ధవ్ ఠాక్రె నిర్లక్ష్యం !
2014 లో మహారాష్ట్ర లో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బిజేపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అదే సమయానికి ఏకనాథ్ షిండే కూడా శివసేనలో నంబర్ టూ స్థానానికి ఎదిగాడు. శివసేనలో ప్రతీ కార్యకర్త ఏకనాథ్ షిండే ని ఇష్టపడేవారు. అలాగే శివసేన బలంగా ఉన్న ప్రాంత స్థానిక నాయకులలో కూడా ఏకనాథ్ షిండే మీద అభిమానం బలంగా ఉంది. అయితే ఏకనాథ్ షిండే దేవేంద్ర ఫడ్నవీస్ తో సన్నిహితంగా ఉండేవారు.. ఎంతలా అంటే చాలా తక్కువ సమయంలో ఫడ్నవీస్, ఏకనాథ్ షిండేలు మంచి స్నేహితులు అయ్యారు. ఉద్ధవ్ ఠాక్రె ఎక్కువగా సంజయ్ రౌత్ మీద ఆధారపడ్డారు. సంజయ్ రౌత్ కి ఏకనాథ్ షిండే కి ఉన్నంత పట్టు శివ సైనికుల మీద ఉండేది కాదు మొదటి నుండి. సంజయ్ రౌత్ ఎక్కువగా డబ్బు,అధికారం కోసం ప్రాకులాడే మనఃస్తత్వం కావడం చేత శివసేన కార్యకర్తలలో ఎవరూ ఎక్కవగా అతనిని ఇష్టపడేవారు కాదు. సరిగ్గా ఇక్కడే ఉద్ధవ్ పెద్ద తప్పు చేశారనే వాదన ఉంది.

ఏకనాథ్ షిండే ఫడ్నవీస్ తో సన్నిహితంగా మెలగడం మీద పెద్దగా అనుమాన పడలేదు కానీ ఏకనాథ్ షిండే ని పక్కన పెట్టి సంజయ్ రౌత్ ని దగ్గర తీసుకొని అతని చెప్పుడు మాటలు విని కాంగ్రెస్,పవార్ లతో కలిసి 2019 లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో సంజయ్ రౌత్ విజయం సాధించాడు. ఏకనాథ్ షిండే కి కాంగ్రెస్,పవార్ లతో కలవడం ఇష్టం లేదు. పాల్ఘార్ సాధువుల విషయంలో ఉద్ధవ్ వైఖరిని తీవ్రంగా నిరసించాడు అప్పట్లో..

ఆ తరువాత వరుసగా కాశీ విశ్వనాథ ఆలయం విషయం కావొచ్చు మరియు నవనీత్ కౌర్ హనుమాన్ చాలీసా విషయం లో అరెస్ట్ చేయడం, పవార్ మీద ఫేస్బుక్ లో వ్యంగ్య వాఖ్య చేసిందని ఒక మహిళని బెయిల్ కూడా ఇవ్వకుండా నెలరోజులు జైల్లో పెట్టడం లాంటి మీద శివసేన కార్యకర్తలు నేరుగా ఏకనాథ్ షిండే ముందు అతనిని తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టారు. కేవలం అధికారం,డబ్బు కోసమే ఏకనాథ్ షిండే మౌనంగా ఉంటున్నాడు అనే విమర్శలు శివసైనికుల నుండి వచ్చాయి.
తన రాజకీయ గురువు అయిన ఆనంద్ దిఘే చెప్పిన ముఖ్య విషయాలు !
ఏకనాథ్ షిండే దురుసుగా ప్రవర్తిస్తాడు హిందూత్వ విషయంలో! అలాగే రాజకీయ వైకుంఠపాళీ లో చివరి మెట్టు ఎక్కాలంటే చాలా ఓర్పుగా ఉండాలి. సమయం నీది కానప్పుడు మౌనంగా ఉండడం నేర్చుకో. సమయం చూసి శత్రువు మీద దెబ్బ కొట్టాలి, శివాజీ మహారాజ్ జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇదే విషయం తేటతెల్లం అవుతుంది. ఇదే ఆనంద్ దిఘే తన శిష్యుడికి చేసిన హిత బోధ !
ఏకనాథ్ షిండే తన రాజకీయ గురువు చెప్పిన విషయాలని పాటించాడు. తన ముఖ్య అనుచరులతో పాటు ఇతర శాసన సభ్యులు ఎంతగా తనమీద ఒత్తిడి తెచ్చినప్పటికీ మౌనంగా ఉన్నాడు తప్పితే ఎప్పుడూ తన మనసులోని ఆలోచనని బయటికి చెప్పలేదు.
విధాన మండలి తో పాటు రాజ్య సభ ఎన్నికలు జరుగుతున్న వేళ చాల రహస్యంగా తన పని ముగించాడు. శివసేన సభ్యులే కాదు కాంగ్రెస్ సభ్యులు కూడా క్రాస్ ఓటింగ్ కి పాల్పడేట్లు చేశాడు ఏకనాథ్ షిండే. అధికారం మత్తులో ఉన్న ఉద్ధవ్ జరగబోయే పరిణామాలని లెక్క చేయలేదు సంజయ్ రౌత్ మాటలు విని.
మరోవైపు ఏకనాథ్ షిండే ఇదే సమయం అని భావించి ఇన్నాళ్ళూ తనని తీవ్రంగా విమర్శిస్తున్న సహచర శాసనసభ్యుల ముందు తన వ్యూహ రచనని బయటపెట్టాడు. అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. తరువాత అందరినీ తీసుకొని సూరత్ వెళ్ళిపోయాడు ఏకనాథ్ షిండే !
క్రాస్ ఓటింగ్ జరిగినప్పుడు అన్నా ఉద్ధవ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ని అప్రమత్తం చేసి ఉండాల్సింది కానీ ఆపని చేయలేదు సరికదా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఉదాసీనంగా ఉండి పోయారు అయితే దీనికి కారణం ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రభుత్వానికి సహకరిస్తే నేరుగా జైళ్లోకి వెళ్ళే అవకాశాలు ఉండడం ప్రధాన కారణం. మాజీ పోలీస్ కమీషనర్ పరారీలో ఉండడం ఒక ఎత్తయితే మాజీ హోమ్ మంత్రి జైల్లో ఉండడం మరో ఎత్తు దరిమిలా పోలీసు వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఎవరిని నమ్మి సహకరిస్తే ఎవరు జైళ్లోకి వెళతారో తెలీని స్థితి ! వెరసి ఏకనాథ్ షిండే కి అన్నీ కలిసి వచ్చాయి తన గురువు చెప్పినట్లే చేశాడు.
ఇక్కడ ఏకనాథ్ షిండే దేవేంద్ర ఫడ్నవీస్ తో నిత్యం టచ్ లో ఉంటూ వస్తున్నాడు కానీ ఉద్ధవ్ దీనిని పసిగట్టలేకపోయాడు. తిరుగుబాటు చేసే సమయానికి ఫడ్నవీస్ సహకరించాడు.
మరో వైపు కాంగ్రెస్,NCP తమ వసూళ్లని పెంచుకునే కార్యక్రమంలో నిత్యం బిజీగా ఉండడం కూడా ఏకనాథ్ షిండే కి కలిసివచ్చింది.
పట్టుమని 15 మంది శివసేన శాసన సభ్యులు తన వైపు లేకపోవడంతో రాజీనాకి షిద్ధంగా ఉన్నాను అంటూ ఉద్ధవ్ వాపోతున్నాడు. కానీ అంతకంటే గత్యంతరం లేదు.
మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ హోషియారీ కోవిడ్ తో హాస్పిటల్ లో ఉన్నారు. ఎవరన్నా నన్ను కలవాలని అనుకుంటే వీడియొ కాన్ఫరెన్స్ ద్వారా నన్ను కలవవచ్చు అంటూ ఒక ప్రకటన చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ వీడియొ కాన్ఫరెన్స్ ద్వారా శాసనసభలో బలనిరూపణ కోసం గవర్నర్ ని అడిగే అవకాశం ఉంది.

Also Read : శివసేనలో ముసలం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్