Saturday, January 18, 2025
Homeసినిమాఏజెంట్ లో గాడ్ ఎవ‌రు..?

ఏజెంట్ లో గాడ్ ఎవ‌రు..?

అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ ‘ఏజెంట్‘. ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత‌ అనిల్ సుంకర ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోవాలని అఖిల్ చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఇంకా చెప్పాలంటే… పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకోవాలని అఖిల్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.

అయితే.. సాక్షీ వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రలో  మమ్ముట్టి కల్నల్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన అఖిల్ ఫస్ట్ లుక్ మమ్ముట్టి కల్నల్ లుక్ ఫస్ట్ లుక్ టీజర్ సినిమా పై అంచనాల్ని పెంచేసింది. అయితే.. భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ మూవీ గత కొన్ని నెలలుగా రిలీజ్ వాయిదా పడుతూనే ఉంది. సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు కానీ.. రావ‌డం అనుమాన‌మే అనే టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీ నుంచి సర్ ప్రైజ్ స్టిల్ ని మేకర్స్ విడుదల చేశారు. విలన్ పాత్రని పరిచయం చేస్తున్నామంటూ ప్రీ లుక్ ని విడుదల చేశారు. ఒంటినిండా కవర్ చేసుకుని చేతిలో ఏకే 47 గన్ తో కనిపిస్తున్న ఓ వ్యక్తి ప్రీలుక్ స్టిల్ ని విడుదల చేశారు. గన్ పట్టుకున్న చేతిపై గాడ్ అని రాసివుంది. ఇంతకీ ఈ గాడ్ ఎవరు? .. అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వ‌ర‌లో క్లారిటీ ఇవ్వ‌నున్నారు మేక‌ర్స్.  ఈ మూవీ రిలీజ్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రి.. అఖిల్ ఏజెంట్ మూవీతో ఆశించిన విజ‌యం సాధిస్తాడేమో చూడాలి.

Also Read : ఏజెంట్ సినిమా ఇప్పట్లో వస్తుందా?  

RELATED ARTICLES

Most Popular

న్యూస్