Wednesday, March 18, 2026
HomeసినిమాDaggubati Abhiram: 'అహింస' రిలీజ్ విషయంలో ఎందుకింత ఆలస్యం? 

Daggubati Abhiram: ‘అహింస’ రిలీజ్ విషయంలో ఎందుకింత ఆలస్యం? 

ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలకు రిలీజ్ డేట్ ఇచ్చేస్తున్నారు .. కొన్ని అప్ డేట్స్ ఇస్తున్నారు .. ప్రమోషన్స్ కూడా మొదలెడుతున్నారు. ఆ తరువాత ఆ సినిమాల ఊసు ఎక్కడ కనిపించడం లేదు .. వినిపించడం లేదు .. కారణం ఏమిటనేది ఎవరికీ తెలియదు. అలాంటి ఒక అయోమయంలో ప్రేక్షకులను పడేసిన సినిమాల జాబితాలో ‘అహింస’ ఒకటిగా కనిపిస్తుంది. దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమయ్యే సినిమా ఇది. ఆర్ పి పట్నాయక్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది.

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించాడు. యూత్ కి కనెక్ట్ అయ్యే ప్రేమకథలను తెరకెక్కించడంలో తేజ స్పెషలిస్ట్. అలాంటి ఆయన గ్రామీణ నేపథ్యంలోని ప్రేమకథను ఎంచుకుని రూపొందించిన ఈ సినిమాను, ఈ ఏప్రిల్ 7వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితం చెప్పారు. కానీ ఎందుకనో ఆ తరువాత మనసు మార్చుకున్నారు. అప్పటి నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ఆగిపోయాయి.

సాధారణంగా చిన్న సినిమాలకు చాలా ఆటంకాలు ఉంటాయి. ప్రేక్షకుల ముందుకు వచ్చేవరకూ వాటికి ప్రాణ సంకటమే. కానీ ఈ సినిమా ఆనంది వంటి పెద్ద బ్యానర్లో నిర్మితమైంది. వెనుక సురేశ్ బాబు వంటి బడా ప్రొడ్యూసర్ ఉన్నారు. తేజ – ఆర్పీ వంటి హిట్ కాంబినేషన్ ఉంది. అయినా ఈ సినిమా ఎందుకు ఆలస్యమవుతోంది? ఎందుకు ఈ సినిమా టీమ్ సైలెంట్ అయింది? అనేదే ప్రేక్షకులకు అర్థం కాని ప్రశ్న. యూత్ అంతా వెయిట్ చేస్తున్న ఈ సినిమా, థియేటర్ లకు ఎప్పుడు వస్తుందనేది చూడాలి.

Also Read : తేజ, అభిరామ్ ‘అహింస’ రిలీజ్ డేట్ ఫిక్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular