Monday, June 15, 2026
HomeTrending NewsKistaiah IAS: ఆనంద్ మోహన్ ను అడ్డుకుంటాం - బండి సంజయ్

Kistaiah IAS: ఆనంద్ మోహన్ ను అడ్డుకుంటాం – బండి సంజయ్

బిహార్ గోపాల్ గంజ్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన పాలమూరు బిడ్డ క్రిష్ణయ్యని 1994లో అతి కిరాతకంగా చంపిన హంతకుడు ఆనంద్ మోహన్ హైదరాబాద్ వచ్చి క్రిష్ణయ్య కుటుంబ సభ్యులను కలవబోతున్నారని వస్తున్న వార్త కలిచివేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. యావజ్జీవ శిక్షపడి జైలు జీవితం అనుభవిస్తున్న ఆనంద్ మోహన్ ను శిక్షాకాలం పూర్తి కాకముందే నితీశ్ కుమార్ ప్రభుత్వం విడదల చేయడం సిగ్గు చేటని విమర్శించారు. ఈ మేరకు బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. నితీష్ కుమార్ వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? పాలమూరు బిడ్డను చంపేసిన హంతకుడు తెలంగాణలో అడుగుపెడుతుంటే ఎందుకు అనుమతిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రజలను కాల్చి చంపి పేదల రక్తం తాగిన యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ ను చంపితే ఖండించిన బీఆర్ఎస్ నేతలు క్రిష్ణయ్య హంతకుల రాకపై ఎందుకు నోరు మెదపడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. క్రిష్ణయ్యను హత్య చేసిన వాళ్లను జైలు నుండి విడిపించడాన్ని కేసీఆర్ సమర్ధిస్తున్నట్లు అర్ధమవుతోందని, నితీశ్ – కేసీఆర్ ఇద్దరూ మాట్లాడుకున్న తరువాతే ఆనంద మోహన్ హైదరాబాద్ వస్తున్నారని ఆరోపించారు. నితీశ్ కుమార్ – కేసీఆర్ మధ్యనున్న దోస్తీని తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. క్రిష్ణయ్యను చంపిన హంతకులను ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అడుగుపెట్టనీయం. ఈ నిర్ణయం మారని పక్షంలో ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బండి సంజయ్ హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular