తెరాస నుండి 20 వేలు వస్తున్నాయి తీసుకోండి. ఓటు ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దాలి అని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. జమ్మికుంట మండలం అంకుశాపూర్ గ్రామంలో ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెరాస విధానాల్ని ఎండగట్టారు. మోదీ గారు 100 కోట్ల వాక్సిన్లు అందజేశారు. రైతులకు ఒక్కొకరికి 6000/- , రైతు వేదిక 10 లక్షలు, చెట్లు పెంచడానికి, స్మశాన వాటికకు ఇలా అన్నిటికీ ప్రధాని మోదీ డబ్బులు ఇస్తున్నారు. ఇది తప్పు అయితే నామీద కేసు పెట్టండని బండి సంజయ్ సవాల్ విసిరారు.
బండి సంజయ్ ప్రసంగం ఆయన మాటల్లోనే…
దళిత బంధు ఎవరు ఆపమని అడగలేదు.. బీసీలు వద్దు అన్నారు అని కెసిఆర్ అంటున్నారు. కెసిఆర్ కి అహంకారం పెరిగింది. GHMC ఎన్నికల్లో 10 వేలు ఇస్తా అని మోసం చేసిండు కెసిఆర్. నా సంతకం ఫోర్జరీ చేసిండు..పాస్ పోర్ట్ బ్రోకర్ కెసిఆర్. అప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారు దగ్గరికి వచ్చి ప్రమాణం చేయమంటే రాలేదు. దళితబంధుకి కూడా సంతకాలు ఫోర్జరీ చేసి లెటర్స్ పెట్టారు. ఎన్నికల కమీషన్ ను పైసలు ఇవ్వాలి అని లేఖ రాసింది మేము. ఇవ్వకుండా ఆపింది కెసిఆర్. అందుకే కెసిఆర్ రాజీనామా చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్న. నా ఇలవేల్పు లక్ష్మి నరసింహ స్వామీ…కెసిఆర్ యాదాద్రి రా.. దళితబంధు ఆపమని లేఖ రాయలేదు అని మేము వస్తం. నువ్వు వస్తావా? నీ నియత్ ఎందొ? నీ నిజాయితీ ఎందో తెల్చుదాం. పేదల పొట్టకొట్టకు. 10 లక్షలు ఇవ్వు లేదంటే రాజీనామా చేసి ఇంట్లో పండు.
నాగార్జునసాగర్ లో కూడా అనే ఇలానే హామీలు ఇచ్చిండు, ఎన్నికలు అవ్వగానే మర్చిపోయాడు. ఎన్నికలప్పుడు ఒక మాట ఎన్నికల తరువాత ఒక మాట. ఎన్నికల తరువాత దళిత బంధు మీద కెసిఆర్ కోర్టులలో కేసులు వేయించి ఇవ్వకుండా తప్పించుకుంటారు. రాజేందర్ అన్న ఇక్కడినుండి దళితబంధు కోసం యుద్ధం ప్రారబిస్తరు. తెలంగాణ అంతా ఇచ్చే వరకు వదిలిపెట్టరు. బీజేపీ నిద్ర పోదు కెసిఆర్ నీ నిద్రపోనియ్యదు. ఫామ్ హౌజ్ లో పండే కెసిఆర్ కి ఓటు వేయకండి. అడ్డదారుల్లో గెలవాలని కెసిఆర్ చూస్తున్నారు. పువ్వు గుర్తును గెలిపించండి. కెసిఆర్ కి బుద్ది చెప్పాలి. అయన అహంకారం అణచాలి.
ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, కూన శ్రీశైలం గౌడ్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణ రెడ్డి, మండల బీజేపీ అధ్యక్షుడు సంపత్, గ్రామ బీజేపీ అధ్యక్షుడు కుమార స్వామి, కోమల్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, రాకేష్ రెడ్డి, విజిత్ తదితరులు పాల్గొన్నారు.