Monday, May 20, 2024
HomeTrending Newsకొమురం భీమ్ పోరాట స్పూర్తి ఆదర్శనీయం

కొమురం భీమ్ పోరాట స్పూర్తి ఆదర్శనీయం

జల్, జమీన్, జంగల్ నినాదంతో అడవిబిడ్డల హక్కుల కోసం పోరాడి అమరుడైన కొమురం భీం జీవితం అందరికీ స్పూర్తిదాయకమైందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. నేడు జోడేఘాట్ లో కొమురం భీమ్ వర్ధంతి అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా నేడు నివాళులు అర్పించారు. కొమురం భీమ్ జీవితమంతా పొరాటాలతోనే గడిచిందని, తన ప్రజల కోసం, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, బానిసత్వపు సంకెళ్లు తెంచడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులని, పోరాటయోధులని కొనియాడారు.

కొమురం భీమ్ ఆశయాలను సీఎం కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. మా ఊళ్ళో మా రాజ్యం అన్న ఆయన నినాదాన్ని నిజం చేసింది కేసిఆర్ సర్కార్ అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేయాలన్న సుదీర్ఘకాల డిమాండ్ ను నెరవేర్చి పాలనాధికారాన్ని అందించిన నేత సీఎం కేసిఆర్ అన్నారు.

కొమురం భీమ్ కొట్లాడిన పోరుగడ్డ జోడే ఘాట్ లో 25 కోట్లతో కొమురం భీమ్ స్మారక చిహ్నం, ఆయన స్మృతి వనం, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసి ఆయన పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియ జేసే గొప్ప ఉద్యమ కేంద్రంగా తయారు చేశారన్నారు.

జోడే ఘాట్ లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ ప్రగతి పథంలో నిలిపారన్నారు.

కొమురం భీమ్ అడవిబిడ్డల ఆత్మగౌరవ ప్రతీక అని, ఆయన 81వ వర్ధంతి సందర్భంగా గిరిజనులు ఆయన పోరాట స్ఫూర్తిని నెమరువేసుకోవాలని సూచించారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్