Saturday, November 23, 2024
HomeTrending Newsరాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకోం - BSF

రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకోం – BSF

దేశ సరిహద్దుల్లో రాష్ట్రాల పోలీసులకు సమాంతరంగా సరిహద్దు భద్రతా దళం(BSF) పనిచేయదని BSF డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో దీనిపై అపోహలు ఎక్కువగా ప్రచారం జరుగుతున్నాయని, BSF చట్ట విరుద్దంగా నడుచుకోదని ఢిల్లీలో ఈ రోజు BSF డైరెక్టర్ జనరల్ వివరించారు. సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు జరిగితే వారిని ఆయా రాష్ట్రాల పోలీసులకే అప్పగిస్తామని, ఎఫ్.ఐ.ఆర్ నమోదు అధికారం వారికే ఉంటుందని, కేసు నమోదు తర్వాత విచారణ, న్యాయ ప్రక్రియ రాష్ట్రాల పరిధిలోనే జరుగుతుందని BSF డిజి వివరించారు.

దేశ సరిహద్దుల్లో కోర్టు వారంట్ లేకుండా సోదాలు చేసేందుకు, అదుపులోకి తీసుకునేందుకు BSF బలగాలకు అధికారం ఉంది. అంతర్జాతీయ సరిహద్దు నుంచి గతంలో 15 కిలోమీటర్లు ఉండగా కేంద్ర ప్రభుత్వం తాజాగా 50 కిలోమీటర్లకు పెంచింది. దీనిపై పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమేనని విమర్శిస్తున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో పంజాబ్ లో ఎన్నికల అంశంగా మారింది.

బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు జరిగి అస్సాం, బెంగాల్ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల జనాభా స్వరూపమే మారిపోయిందని, అటు పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల అక్రమ చొరబాట్లు పెరిగాయని BSF డిజి వెల్లడించారు. సరిహద్దుల్లో అర్ధరాత్రి కూడా నిఘా కొనసాగుతోందన్నారు. 2020 ఏడాదిలో కేవలం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 32 వేల మంది అక్రమచోరబాటు దారులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల్లోని అన్ని చెక్ పోస్టుల వద్ద మహిళా అధికారులను నియమించామని BSF డిజి పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్