Tuesday, March 10, 2026
HomeTrending NewsDelhi: ఢిల్లీలో వర్షం...ఉక్కపోత నుంచి ఉపశమనం

Delhi: ఢిల్లీలో వర్షం…ఉక్కపోత నుంచి ఉపశమనం

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం పడుతున్నది. హస్తినలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. ఉదయం ఏడు గంటల వరకు 13 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. ఆకస్మిక వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ద్వారకా, శాస్త్రీ భవన్, బాదర్‌పూర్‌ ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తాజా వానలతో ఢిల్లీ, గురుగ్రామ్‌, నోయిడా ప్రాంతాల్లో ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించినట్లయింది. వర్షాలతో ఒక్కసారిగా వాతావరణ చల్లపడింది. ఈ రోజు 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతంలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని రీజినల్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ సెంటర్‌ (RWFC) తెలిపింది.  ఇక నుంచి 27 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయిని వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular