Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Womens Ashes: వన్డే సిరీస్ కూడా ఇంగ్లాండ్ దే

Womens Ashes: వన్డే సిరీస్ కూడా ఇంగ్లాండ్ దే

ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరుగుతోన్న యాషెష్ సిరీస్-2023లో వన్డే సిరీస్ ను కూడా ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. నేడు జరిగిన చివరి వన్డేలో 69 పరుగులతో విజయం సాధించింది. టాంటన్ లోని కూపర్ అసోసియేట్స్ కంట్రీ గ్రౌండ్స్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేశారు. వర్షం కారణంగా డక్ వర్త్ లూయీస్ పధ్ధతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని 44 ఓవర్లకు 269 పరుగులుగా నిర్ధారించారు. అయితే ఆసీస్  35.3  ఓవర్లలో 199 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ నటాలీ స్కివర్ బ్రంట్ 129 పరుగులతో సత్తా చాటింది.  కెప్టెన్ హిదర్ నైట్67; డేనియల్ వ్యాట్-43 రన్స్ చేసి రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో గార్డ్ నర్, జోనాసేన్ చెరో మూడు; మేగాన్ స్కట్అ, లానా కింగ్  చెరో వికెట్ పడగొట్టారు.

ఆసీస్ 15 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.  అలేస్సా హెలీ-53; బెత్ మూనీ-41 మాత్రమే రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కాటే క్రాస్ 3; లారెన్ బెల్, చార్లోట్ డీన్ చెరో 2; ఎక్సెల్ స్టన్, స్కివర్ బ్రంట్ చెరో వికెట్ పడగొట్టారు.

నటాలి స్కివర్ బ్రంట్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ తో పాటు,  ఆసీస్ ఆల్ రౌండర్ ఆష్లీ గార్డ్ నర తో కలిసి సంయుక్తంగా ప్లేయర్ అఫ్ డ సిరీస్ కూడా దక్కించుకుంది.

ఈ సిరీస్ లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ ను ఆసీస్ గెల్చుకోగా.. టి 20, వన్డే సిరీస్ లను ఇంగ్లాండ్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్