Saturday, June 6, 2026
HomeTrending Newsగ్రీన్ ఇండియా చాలెంజ్ లో మహిళా ఎంపీలు

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మహిళా ఎంపీలు

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన పార్లమెంటరీ మహిళ సాధికారత స్టాండింగ్ కమిటీ సభ్యులు. డా.హీనా గవిట్ నేతృత్వంలోని పార్లమెంటరీ మహిళ సాధికారత స్టాండింగ్ కమిటీ లోక్ సభ,రాజ్యసభ కమిటీ సహచరులు మొక్కలు నాటారు.

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హైదరాబాద్ పర్యటనలో బాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారబించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా ప్రజ్వల రెస్క్యూ హోమ్ లో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జర్నదాస్ బైద్య, శారదా బెన్ అనిల్ భాయ్,లాకెట్ చటర్జీ,మమతా మొహంత,రమ్య హరిదాస్,మలోత్ కవిత,సరోజ్ పాండే,రీతి పాఠక్,శతాబ్ది రాయ్, గోమతి సాయి,సర్మిష్ట సేథి, గీత వంగా,వందన చవాన్, ఛాయా వర్మ,క్వీన్ ఓజా పాల్గొని మొక్కలు నాటారు.

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ను కమిటీ సభ్యులు ప్రశంసించారు.ఈ కార్యక్రమాన్ని భారతీయులందరు ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular