Tuesday, March 17, 2026
HomeTrending NewsIndian Army: పదాతి దళంలోకి మహిళా అధికారులు

Indian Army: పదాతి దళంలోకి మహిళా అధికారులు

దేశ చరిత్రలో ఆర్టిలరీ రెజిమెంట్‌లోకి సైన్యం తొలిసారిగా ఐదుగురు మహిళా అధికారులను తీసుకున్నది. చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (OPA)లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అధికారులు శనివారం ఆర్టిలరీ రెజిమెంట్‌లో చేరారు. ఆర్టిలరీ రెజిమెంట్‌లో చేరిన మహిళా అధికారుల్లో లెఫ్టినెంట్ మెహక్ సైనీ, లెఫ్టినెంట్ సాక్షి దూబే, లెఫ్టినెంట్ అదితి యాదవ్, లెఫ్టినెంట్ పవిత్రా మౌద్గిల్ ఉన్నారని అధికారులు తెలిపారు. ఐదుగురు మహిళా అధికారుల్లో ముగ్గురిని చైనా సరిహద్దు వెంబడి మోహరించిన యూనిట్లలో, మిగతా ఇద్దరిని పాక్‌ సరిహద్దుకు సమీపంలో ‘సవాల్‌తో కూడుకున్న ప్రదేశాల్లో’ నియమించారు.

ఆర్టిలరీ రెజిమెంట్‌లో మహిళా అధికారులను నియమించడం భారత సైన్యంలో వస్తున్న మార్పులకు నిదర్శనం. ఇదిలా ఉండగా.. చీఫ్ అఫ్ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ఆర్టిలరీ యూనిట్లలో మహిళా అధికారులను  నియమించినట్లు జనవరిలో ప్రకటించారు. ఈ మేరకు సైన్యం ప్రతిపాదనలు కేంద్రానికి పంపగా.. ఆమోదం తెలిపింది. దాంతో తొలిసారిగా ఆర్టిలరీ రెజిమెంట్‌లోకి ఐదుగురు మహిళా అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇదిలా ఉండగా.. చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో పాసింగ్‌ పరేడ్‌ జరిగింది. 189 క్యాడెట్స్‌ శిక్షణ పొందగా.. ఇందులో భూటాన్‌కు చెందిన 29 మంది క్యాడెట్స్‌ ఉన్నారు. ఈ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ను బంగ్లాదేశ్‌ ఆర్మీ జనరల్‌ ఎస్‌ఎం షఫీయుద్దీన్‌ అహ్మద్‌ సమీక్షించి, క్యాడెట్స్‌ను అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular