Sunday, January 19, 2025
HomeTrending Newsభద్రతామండలి సూచనలు ఆఫ్ఘన్లో బేఖాతర్

భద్రతామండలి సూచనలు ఆఫ్ఘన్లో బేఖాతర్

అఫ్గానిస్తాన్ మహిళలు, దశాబ్దాల తర్వాత ముఖానికి ముసుగు ధరించాలానే నిర్భందాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తప్పుపట్టింది. తాలిబన్లు మహిళల హక్కులు కాపాడాలని సూచించింది. విద్య, వైద్యం, హక్కుల విషయంలో మహిళల పట్ల తాలిబన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని యుఎన్ భద్రతామండలి ఆరోపించింది. అయితే భద్రతా మండలి సూచనలను తాలిబన్లు కొట్టిపారేశారు. దేశ అంతర్గత వ్యవహారాలూ, ఆచారాల విషయంలో ఇతరుల జోక్యాన్ని పట్టించుకోబమని తాలిబన్లు ప్రకటించారు. ఇస్లామిక్ షరియాకు అనుగుణంగానే ఆఫ్ఘనిస్తాన్లో పాలన సాగిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి అబ్దుల్ కుహర్ బల్ఖి  వెల్లడించారు. హిజాబ్ ముస్లిం మహిళల ప్రాథమిక విధి, హక్కు అని బల్ఖి స్పష్టం చేశారు.

ఏ మహిళ అయిన బురఖా ధారణలో అధికారిక హెచ్చరికలను నిర్లక్ష్యం చేసినా లేదా అంగీకరించకపోయినా వారి కుటుంబంలోని సంరక్షకుడు మూడు రోజుల పాటు జైలు పాలవుతారు. తాలిబాన్లు, 1990లో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు బురఖా పద్ధతిని అమల్లోకి తెచ్చారు. అయితే, గతేడాది అఫ్గాన్‌లో మళ్లీ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి తాలిబాన్లు, ఈ విధానాన్ని ఆఫ్గాన్ నగరాల్లో ఆచరణలోకి తీసుకురాలేదు. అఫ్గానిస్తాన్‌లోని చాలామంది మహిళలు బురఖా ధరిస్తారు. ముఖ్యంగా నగర ప్రాంతాలకు చెందిన కొందరు తలను మాత్రమే కవర్ చేసుకుంటారు. 

Also Read : అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనపై నార్డిక్ సదస్సు ఆందోళన   

RELATED ARTICLES

Most Popular

న్యూస్