ఐసిసి వరల్డ్ కప్ క్రికెట్ క్వాలిఫైర్ సూపర్ సిక్స్ లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై శ్రీలంక 21 పరుగులతో విజయం సాధించింది. శ్రీలంక 47.4 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ కాగా, నెదర్లాండ్స్ 40 ఓవర్లలో 192 రన్స్ కు ఆలౌట్ అయ్యింది.
బులవాయోలోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. స్కోరు బోర్డు బోణీ కాకముందే ఓపెనర్ పాథుమ్ నిశాంక ఔటయ్యాడు. 34 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ధనుంజయ డిసిల్వా 93 పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో తోడ్పడ్డాడు. మహీష తీక్షణ-28; వానిందు హసరంగ-20 రన్స్ చేశారు.
నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్, బాస్ డే లీడ్ చెరో 3; షకీబ్ జుల్ఫిఖర్ 2; రియాన్ క్లీన్, ఆర్యన్ దత్ చెరో వికెట్ సాధించారు.
ఆ తర్వాత నెదర్లాండ్స్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. కెప్టెన్ స్కాట్ ఎడ్వార్డ్స్-67; వెస్లీ బర్రేసి-52; బాస్ డే లీడ్-41 మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. మొత్తం నలుగురు డకౌట్ కావడం గమనార్హం.
లంక బౌలర్లలో మహీష్ తీక్షణ 3; వానిందు హసరంగ 2; లాహిరు కుమార, దిల్షాన్ మధుశంక, దాసున్ శనక తలా ఒక వికెట్ పడగొట్టారు.
ధనుంజయ డిసిల్వా కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.