Warne no more: ప్రపంచ దిగ్గజ లెగ్ స్పిన్నర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ గుండెపోటుతో మృతి చెందారు. అయన వయసు 52 సంవత్సరాలు. థాయ్ లాండ్ లో ఉన్న వార్న్ గుండెపోటుకు గురయ్యారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ లెగ్ స్పిన్నర్ గా గుర్తింపు సాధించిన షేన్ వార్న్ తన టెస్ట్ క్రికెట్ కెరీర్ లో 145 మ్యాచ్ లు ఆడి 708 వికెట్లు, తీశాడు. 194 వన్డేలు ఆడి 293 వికెట్లు సాధించారు.
ఒకే టెస్టులో పదిసార్లు.. పది వికెట్లు చొప్పున సాధించిన షేన్, 37 సార్లు ఐదు వికెట్ల చొప్పున సాధించిన ఘనత సాధించారు.
1993 మర్చి 24 న తొలి వన్డే (న్యూజిలాండ్ పై); 2005 జనవరి 10న చివరి వన్డే (ఆసియా లెవెన్ పై) ఆడారు.
1992 జనవరి 2న తొలి టెస్ట్ (ఇండియాపై); 2007 జనవరి 2న (ఇంగ్లాండ్ పై) చివరి టెస్ట్ ఆడారు. 2007 జనవరి 7న టెస్ట్ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికారు.
55 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన వార్న్ 57 వికెట్లు తీశాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తొలి సీజన్ విజేతగా అవతరించడంలో ఆ జట్టు కెప్టెన్ గా షేన్ వార్న్ కృషి ఎంతో ఉంది.
షేన్ మరణంపై క్రికెటర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.