Saturday, September 21, 2024
HomeTrending Newsపర్యావరణంతోనే మానవాళి మనుగడ

పర్యావరణంతోనే మానవాళి మనుగడ

World Forest Day : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో ప్రపంచ అటవీ దినోత్సవ ఉత్సవాలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ పి.నవీన్ రావు, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. కేబీఆర్ పార్క్ లో మొక్కలు నాటిన చీఫ్ జస్టిస్, ఇతర ప్రముఖులు. పార్క్ లో వాకింగ్ చేసిన చీఫ్ జస్టిస్, అతిథులు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు చాలా బాగున్నాయని, నగరంలో కాలుష్యం తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రభుత్వాన్ని అభినందించారు.

ఒక చెట్టు తన 50 ఏళ్ల జీవిత కాలంలో రూ.33 లక్షల విలువైన సంపదను అందిస్తుంది. ఒక ఏడాదిలో ఒకచెట్టు 12 కిలోగ్రాముల కార్బన్‌డై ఆక్సైడ్‌ను తీసుకొని నలుగురు సభ్యులుగల కుటుంబానికి సరిపడా ఆక్సిజన్‌ అందిస్తుంది. 55 ఏళ్ల జీవిత కాలంలో ఒక చెట్టు 5.3 లక్షల విలువైన ఆక్సిజన్‌ను, 6.4 లక్షల విలువైన మట్టి కొట్టుకుపోకుండా కాపాడుతుంది. 10.50 లక్షల విలువైన చల్లదనాన్ని ఇస్తుంది.6.4 లక్షల విలువైన సారాన్ని నేలకు అందిస్తోంది. మానవాళి మనుగడ పర్యావరణంపైనే ఆధారపడి ఉందని పర్యావరణాన్ని కాపాడుకుంటే భావితరానికి భవిష్యత్‌ ఉంటుందని చీఫ్ జస్టిస్ అన్నారు.

పార్క్ ఖాళీ స్థలంలో మర్రి మొక్కను నాటిన చీఫ్ జస్టిస్, నేరేడు మొక్కను నాటిన జస్టిస్ నవీన్ రావు, వేప మొక్కను నాటిన ఎంపీ సంతోష్ కుమార్. తెలంగాణకు హరితహారం ద్వారా జంగిల్ బచావో- జంగిల్ బడావో నినాదంతో చేపట్టిన కార్యక్రమాలను చీఫ్ జస్టిస్ కు వివరించిన అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్.ఎం. డోబ్రియాల్. మార్చి 21వ తేది ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యెక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు దొబ్రియాల్ వెల్లడించారు.

Also Read : జంగిల్ బ‌చావో- జంగిల్ బ‌డావో

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్