Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్WPL: ముంబై జోరు- యూపీపై గెలుపు

WPL: ముంబై జోరు- యూపీపై గెలుపు

విమెన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై జోరు కొనసాగుతోంది. యూపీ వారియర్స్ తో జరిగిన నేటి మ్యాచ్ ను 8 వికెట్ల తేడాతో గెల్చుకుంది.  ఈ టోర్నీలో ముంబైకి ఇప్పటివరకూ ఓటమి లేదు, ఇది వరుసగా నాలుగో విజయం.

యూపీ ఇచ్చిన 160 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 33 బంతుల్లో 9 ఫోర్లు, 1  సిక్సర్ తో 53; నటాలీ స్కివర్ బ్రంట్ 31 బంతుల్లో 6ఫోర్లు,1 సిక్సర్ తో 45 పరుగులతో నాటౌట్ గా నిలవగా; యస్తికా భాటియా 27 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్సర్ తో 42; హేలీ మాథ్యూస్ 12 పరుగులు చేసి ఔటయ్యారు.

బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూపీ 8 పరుగుల వద్ద ఓపెనర్ దేవికా వైద్య వికెట్ కోల్పోయింది. ఓపెనర్, కెప్టెన్ ఎలీస్సా హెలీ 46బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 58;  తహిలా మెక్ గ్రాత్ 37 బంతుల్లో 9 ఫోర్లతో 50;  కిరణ్ నవ్ గిరే 17 పరుగులతో మాత్రమే రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది.

ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ 3; అమేలియా కెర్ర్ 2; హెలీ మాథ్యూస్ ఒక వికెట్ పడగొట్టారు.

హర్మన్ కౌర్ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్