Sunday, September 29, 2024
HomeTrending Newsఐఏఎస్ ల బదిలీలు: శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్ లకు స్థాన చలనం

ఐఏఎస్ ల బదిలీలు: శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్ లకు స్థాన చలనం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన మొదటి ప్రక్షాళనగా దీన్ని చెప్పవచ్చు. గత జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నలుగురు అధికారులు వై శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్, రజత్ భార్గవ, డి.మురళీధర్ రెడ్డిలను వారి పోస్టులనుంచి బదిలీ చేసి సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.

మిగిలిన బదిలీల విషయానికి వస్తే….

  1. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్.
  2. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్
  3. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బూడితి రాజశేఖర్
  4. కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది
  5. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్
  6. పౌరసరఫరాలశాఖ కమిషనర్ గా సిద్దార్థ్ జైన్
  7. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరబ్ గౌర్, నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా  అదనపు బాధ్యతలు
  8. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్, ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు
  9. ఉద్యాన, ఆక్వా కల్చల్,  మత్స్యశాఖ విభాగాల కార్యదర్శిగా బాబు.ఎ
  10. ఏపీ సీఆర్ డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్
  11. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న
  12. ఆర్ధిక వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం. జానకి
  13. పశు సంవర్ధకశాఖ, డెయిరీ డెవలప్మెంట్ కార్యదర్శిగా ఎం.ఎం. నాయక్
  14. గనులశాఖ డైరెక్టర్, కమిషనర్ గా ప్రవీణ్ కుమార్, ఏపీఎండీసీ ఎండీగా  అదనపు బాధ్యతలు
  15. ఆర్థికశాఖ కార్యదర్శిగా వాడరేవు వినయ్ చంద్

లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్