Friday, June 12, 2026
HomeTrending Newsదామరచర్లకు సిఎం కెసిఆర్

దామరచర్లకు సిఎం కెసిఆర్

సూర్యాపేట జిల్లా దామరచర్ల లో నిర్మితమౌతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతి పర్యవేక్షణ కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం ఉదయం వెళుతున్నారు.

సిఎం పర్యటన వివరాలు :
సోమవారం (తేదీ నవంబర్ 28 ) ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుండి సిఎం కెసిఆర్ దామరచర్ల పర్యటనకోసం బయలు దేరుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి వాయుమార్గం ద్వారా ప్రయాణించి మధ్యాహ్నం 12 గంటల కల్లా దామరచర్ల చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని విద్యుత్ శాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సిఎం కెసిఆర్ పరిశీలిస్తారు. థర్మల్ పవర్ స్టేషన్ లో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతి గురించి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం హైద్రాబాద్ కు సిఎం కెసిఆర్ తిరుగు ప్రయాణమౌతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular