నామినేటెడ్ పదవుల పంపకంపై తెలుగుదేశం పార్టీ పెదవి విరిచింది. అధికారాలు, నిధులు ఉన్న పదవులు సొంత వారికి కట్టబెట్టారని, నామమాత్రపు పదవులు, నిధులు లేని కార్పోరేషన్లు మాత్రం బిసి, ఎస్సీ, మైనార్టీలకు కట్టబెట్టారని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. పరిపాలించే స్థానాల్లో సొంతవారు, పాలించబడే స్థానాల్లో బడుగులు అన్న చందంగా వైసీపీ తీరు వుందని, ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి రుజువైదని యనమల ధ్వజమెత్తారు.
రాష్ట్రాన్ని ఆర్ధికంగా దివాళా తీయించారని, జీతాలకు, సంక్షేమ పథకాలకు కూడా అప్పులపైనే ఆధారపడుతున్నారని యనమల ఎద్దేవా చేశారు. ఇప్పటికే సలహాదారుల పేరుతో కోట్లాది రూపాయలు దుబారా చేస్తున్నారని, ఇప్పుడు నామినేటెడ్ పేరుతొ మరింత దోచుకునేందుకు సిద్ధమవుతున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు,