Sunday, September 8, 2024
HomeTrending Newsయోగి టీంలో 52 మంది మంత్రులు

యోగి టీంలో 52 మంది మంత్రులు

 Yogi Adityanath Swearing :  యూపీ ముఖ్యమంత్రిగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు ( శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో గవర్నర్ ఆనంది బెన్ పటేల్ యోగి ఆదిత్య నాథ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా బ్రిజేష్ పాఠక్, కేశవ్ ప్రసాద్ మౌర్య  ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, సాధువులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

యోగి తన మంత్రివర్గంలో 52 మందిని తీసుకున్నారు. కేబినెట్‌లో కేశవ్ ప్రసాద్ మౌర్య (ఉప ముఖ్యమంత్రి), బ్రజేష్ పాఠక్ (ఉప ముఖ్యమంత్రి), సూర్య ప్రతాప్ షాహి, సురేష్ కుమార్ ఖన్నా, స్వతంత్ర దేవ్ సింగ్, బేబీ రాణి మౌర్య, లక్ష్మీనారాయణ చౌదరి, జయవీర్ సింగ్, ధర్మపాల్ సింగ్, నంద్ గోపాల్ గుప్తా, భూపేంద్ర సింగ్ చౌదరి, అనిల్ రాజ్‌భర్, జితిన్ ప్రసాద, రాకేష్ సచన్, అరవింద్ కుమార్ శర్మ, యోగేంద్ర ఉపాధ్యాయ్, ఆశిష్ పటేల్, సంజయ్ నిషద్ ఉన్నారు. వీరితో పాటు సహాయ మంత్రులు కూడా ఉన్నారు.

యోగి ఆదిత్యనాథ్‌ 1972 జూన్‌ 5 న ప్రస్తుత ఉత్తరాఖండ్‌లోని పౌరిగడ్వాల్‌ జిల్లాలోని పాంచుర్‌లో రాజ్‌పుట్‌ కుటుంబంలో జన్మించారు. ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో గల హెచ్‌ఎన్‌బీ గర్‌వాల్ యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేశారు. 26 ఏళ్లకే యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఈతలో, బ్యాడ్మింటన్‌లో ప్రావీణ్యం ఉంది. 1998లో తొలిసారిగా గోరఖ్‌పూర్‌ నుంచి ఎన్నికైనప్పుడు పార్లమెంటులో అతిపిన్న వయస్కుడు (26) ఆయనే. అదే నియోజకవర్గం నుంచి అయిదుసార్లు (1998, 1999, 2004, 2009, 2014) ఎన్నికయ్యారు.

గోరఖ్‌నాథ్ మఠాధిపతిగా సైతం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. గోరఖ్‌నాథ్ మఠాధిపతి అస్తమయంతో ఆయన వారసుడిగా మఠం బాధ్యతలు స్వీకరించారు. చిన్ననాటి నుంచే హిందూత్వ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. కేవలం 26 ఏళ్ల వయసులోనే గోరఖ్‌ పూర్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.12 వ లోక్‌సభలో అతి చిన్న వయసు ఎంపీగా రికార్డు సృష్టించారు. 1998 నుంచి 2014 వరకు వరుసగా 5 సార్లు ఆయన ఎంపీగా గెలిచారు. 44 ఏళ్లకే దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. ఆదిత్యనాథ్ గోరఖ్‌ పూర్ లోని గోరఖ్‌ నాథ్ మఠాధిపతిగా ఉన్నారు. తన గురువు మహంత్ ఆదిత్యనాథ్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. హిందూత్వ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ యోగిగా మారారు.

పార్లమెంటు సభ్యునిగా కన్నా హిందూ జాతీయవాదిగానే ఆయన ఎక్కువగా పాపులర్‌ అయ్యారు. ఇతర మతాల వారిని హిందువులుగా మార్చాలన్నదే తన జీవిత లక్ష్యమని ఆయన చెప్తారు. 2005లో రాష్ట్రంలోని ఈటాలో 5 వేల మందిని హిందూ మతంలోకి మార్పిడి చేయించారు. ఈ సందర్భంగా భారతదేశాన్ని హిందూ జాతిగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశారు.

Also Read : యోగి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్దం

RELATED ARTICLES

Most Popular

న్యూస్