Sunday, September 8, 2024
HomeTrending NewsBRS నేతలపై మహిళ కమీషన్ కు వైఎస్ షర్మిల పిర్యాదు

BRS నేతలపై మహిళ కమీషన్ కు వైఎస్ షర్మిల పిర్యాదు

ఢిల్లీలో ఈ రోజు జాతీయ మహిళ కమీషన్ చైర్ పర్సన్ రేఖ శర్మను కలిసిన YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… BRS నేతలపై మహిళ కమీషన్ కు పిర్యాదు చేశారు. అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళ కమీషన్ ముందు పెట్టిన వైఎస్ షర్మిల…మహిళలు అనే గౌరవం BRS పార్టీకి లేదన్నారు. ఆ తర్వాత మీడియా తో మాట్లాడిన షర్మిల ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న నాపై దాడులకు దిగుతున్నారని అన్నారు. పబ్లిక్ గానే ఎలా బయట తిరుగుతావో చూస్తాం అంటూ బెదిరిస్తున్నారని, తెలంగాణలో మహిళలకు గౌరవం లేదు,రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Ys Sharmila Delhi

కేసీఅర్ కొడుకు కేటీఆర్ ఆడవాళ్ళు అంటే వ్రతాలు చేసుకోవాలి అంటాడని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. మహిళలు అంటే ఒక మంత్రికి మరదలుతో సమానం అంట  అన్నారు. ఒక ఎమ్మెల్యే మహిళా అని చూడకుండా కొజ్జా అని అంటున్నాడని, ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తే శిఖండి అని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని వైఎస్ షర్మిల చెప్పారు. వైఎస్ షర్మిల ఇచ్చిన పిర్యాదు పై సానుకూలంగా స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ… అసభ్యకర పదజాలంతో దూషించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Also Read :తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి – వైఎస్ షర్మిల

RELATED ARTICLES

Most Popular

న్యూస్