Saturday, April 20, 2024
HomeTrending Newsగూగుల్ మ్యాప్ తో సిఎం గప్పాలు - YS షర్మిల

గూగుల్ మ్యాప్ తో సిఎం గప్పాలు – YS షర్మిల

వారం రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు జరిగిన ఆస్తి,పంట,ప్రాణం నష్టంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో రాష్ట్రం విలవిలలాడుతుంటె ప్రజలను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి KCR ఎక్కడున్నాడు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి అధ్యయనం పై కనీసం ఏరియల్ సర్వే కూడా నిర్వహించలేని నిర్లక్ష్య ముఖ్యమంత్రి కేసీఅర్ అంటూ షర్మిల ఎద్దేవ చేశారు. జనం బాధల్లో ఉంటే గుండె ధైర్యం ఇవ్వాల్సింది పోయి గూగుల్ మ్యాప్ చూస్తూ గప్పాలు కొట్టుడు కేసీఅర్ పాలన అంటూ విమర్శించారు. కేసీఅర్ కు రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదని… ఆయనకు ముందస్తు ఎన్నికల మీద ఉన్న సోయి వరద బాధితులను ఆదుకోవడంలో లేదని షర్మిల అన్నారు. మందస్తు ఎన్నికలకోసం చేస్తున్న గ్రౌండ్ వర్క్ లో పావొంతైనా వరదల మీద దృష్టి పెట్టి ఉంటే నష్టం కొంచమైనా తగ్గేది అని షర్మిల చెప్పారు.
వారం రోజులుగా జనాలు వరదల్లో చిక్కుకొని వణుకుతున్నారని…15 లక్షల ఎకరాలకు పైగా పంటలు నష్టపోయి రైతన్న కన్నీరు పెడుతున్నారంటూ షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. రోడ్లు కొట్టుకపోయి రవాణా స్తంభిస్తే…వైద్యం అందించాల్సిన దవాఖానలు మునిగిపోతుంటే, ఆదుకోవాల్సిన అవసరం లేదా అంటూ కేసీఅర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గడి దాటి బయటకు రావాలని,బాధితులను ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.

మునిగిన కాళేశ్వరం పంపులను బయటకు తీయడానికి మరో లక్ష కోట్లు అప్పులు తేండి

ముఖ్యమంత్రి కేసీఅర్ కు 70వేల కోట్ల కమీషన్లు తెచ్చి పెట్టిన ఆయన బంగారు ప్రాజెక్ట్.. ఇప్పుడు గోదావరి వరదలకు పంప్ హౌజ్ లు నీట మునిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ పంపులను బయటకు తీయడానికి మరో లక్ష కోట్లు అప్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉండండని సీఎం కేసీఅర్ పై షర్మిల సేటైర్లు వేశారు. చిన్న దొర కేసీఅర్ కు ఆంధ్ర ఫ్రెండ్ అయిన మెగా కృష్ణారెడ్డి మళ్ళీ పంపులు బయటకు తీసే ప్రాజెక్ట్ కోసం పోటీ పడతారని… కమీషన్ల కోసం కాలి సంచులు రెడీ చేసుకోమని షర్మిల వ్యంగ్యంగా విమర్శించారు.

Also Read : కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయి వరద 

RELATED ARTICLES

Most Popular

న్యూస్