Wednesday, March 11, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్సోనూసూద్ తో ఎమ్మార్పీఎస్ నేతల భేటి

సోనూసూద్ తో ఎమ్మార్పీఎస్ నేతల భేటి

ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ ను వైఎస్సార్ జిల్లా వీరబల్లి మండల ఎమ్మార్పీఎస్ నేతలు నరసింహులు, వర్ల వెంకటరమణ, రామ్మోహన్ లు కలిశారు. ఆదివారం వీరు ముంబైలోని సోనూ సూద్ నివాసానికి వెళ్లి ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలిపారు. మండలంలోని గడికోట గ్రామంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని సోనూసూద్ ను నేతలు ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

కాలు పోగొట్టుకొన్న విద్యార్థికి వైద్య ఖర్చులు భరిస్తా : సోనూసూద్
గడికోట గ్రామం జల్లేవాండ్లపల్లెకు చెందిన వెంకటసాయి చంద్ర అనే విద్యార్థి రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు కు తీవ్ర గాయం కాగా డాక్టర్లు ఆపరేషన్ చేసి కాలు ను తొలగించారు. ఈ భాదిత విద్యార్థి వెంకట సాయి చంద్రను ముంబైలోని సోనూసూద్ వద్దకు ఎమ్మార్పీఎస్ నేతలు తీసుకెళ్లారు. విద్యార్థిని చూసిన సోనూసూద్ చలించిపోయారు. ఆ విద్యార్థిని వెంటనే మొంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి కి పంపించి వైద్య పరిక్షలు చేయించుకోమని తెలిపారు. కాలు బాగయ్యేవరకు ముంబైలోనే ఉండి చికిత్స చేయించుకోవాలని సలహా ఇచ్చారు. వైద్య ఖర్చులు ఎంతైనా తానే భరిస్తానని సోనూ సూద్ హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పిఎస్ నేతలు ప్రసాద్, సంజీవ, మురళీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular