Friday, March 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ప్రీతి కుటుంబానికి న్యాయం : కృతికా

ప్రీతి కుటుంబానికి న్యాయం : కృతికా

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రీతి సుగాలి తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా చూస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్, దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా హామీ ఇచ్చారు. ఆదివారం కర్నూలు నగరంలోని చాణిక్యపురి కాలనీ నేహా రెసిడెన్సిలో నివాసం ఉంటున్న ప్రీతి తల్లిదండ్రులు ఎస్‌.రాజు నాయక్, ఎస్‌. పార్వతి దేవిలను కృతికా పరామర్శించారు. దాదాపు ఒక గంట సేపు వారితో ట్లాడారు. కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే తాను ఇక్కడకు వచ్చానని ఆమె తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో అడిగి తెలుసుకోమన్నారని శుక్లా వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ప్రీతి తల్లిదండ్రులు కోరారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తామని కృతికా హామీ ఇచ్చారు. సిబిఐ ఎంక్వైరీ కోసం ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంటామని ప్రీతి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

అంతకు ముందు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ కే.ఫక్కీరప్పతో కృతికా శుక్లా సమావేశమయ్యారు. సుగాలి ప్రీతీ మృతి సంఘటన, రిలీఫ్ కు సంబంధించి తీసుకోవలసిన చర్యల గురించి వారితో చర్చించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్