పులివెందులలో సైతం సిఎం జగన్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని, ఆయనకు 51 శాతం మంది మాత్రమే మద్దతు పలికినట్లు పీకే టీమ్ సర్వేలో వెల్లడయ్యిందని బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కంటే ఎక్కువ ప్రజా మద్దతు కలిగిన సొంత పార్టీ ఎమ్మెల్యేలను  ఉద్దేశించి మీరు ప్రజల వద్దకు వెళ్ళడం లేదంటూ సిఎం చెప్పడం పాము స్వయంగా తన పిల్లలను మింగినట్లుందని ఎద్దేవా చేశారు. గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణతో కలిసి సత్య కుమార్ మీడియాతో మాట్లాడారు.

గడప గపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తుంటే వారిని ఏ రకంగా నిలదీస్తున్నారో అందరం ప్రత్యక్షంగా చూస్తున్నామని, వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని… దీనిపై సిఎం జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.  సంక్షేమ పథకాలపై అధికార పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, కేంద్రం 10లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తే 5 లక్షల టన్నులు వైసీపీ  నేతలు అమ్ముకున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సరికాదన్నారు సత్య. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే జిల్లాలకు కూడా కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకుంటారని వ్యంగ్యంగా అన్నారు.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)కి, వైఎస్సార్సీపీకి పెద్దగా తేడాలేదని సత్య కుమార్ ఘాటుగా విమర్శించారు.  అది ఎంత విధ్వంసకర సంస్థనో, వైసీపీ కూడా అంటే విధ్వంసకర పార్టీ అని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *