Saturday, April 20, 2024
HomeTrending Newsభూములు దోచేస్తున్నారు: బిజెపి ఆరోపణ

భూములు దోచేస్తున్నారు: బిజెపి ఆరోపణ

రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతల ఆగడాలను సాగనివ్వబోమని బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ స్పష్టం చేశారు. విశాఖలో భూములను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని, ప్రజలను భయపెట్టి  భూములు లాక్కుని విల్లాలు, అపార్ట్ మెంట్ లు నిర్మిస్తున్నారని, ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై సిబిఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నేడు అరెస్టయిన శరత్ చంద్రారెడ్డి మొబైల్ లో దసపల్లా భూములకు సంబంధించిన మొత్తం సమాచారం దొరికిందని చెప్పారు. విశాఖలో ఫ్లాట్లు కొనాలనుకునే వారు వివాదాస్పద భూముల్లోవి కొనవద్దని సూచించారు.

పులివెందుల బ్యాచ్ వైజాగ్ కు మకాం మార్చిందని, రాబందుల్లా భూములను దోచుకుంటున్నారని బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ విమర్శించారు. వైఎస్ హయాంలో ఇదే బ్యాచ్ హైదరాబాద్ లో భూ కబ్జాలకు పాల్పడిందన్నారు. భూములు కొల్లగొట్టడానికే భూముల రీసర్వే పథకాని  వినియోగించుకుంటున్నారని సత్య వ్యాఖ్యానించారు. కక్ష సాధింపులతో వైసీపీ అరాచక పాలన సాగిస్తోందన్నారు. మంగలిక్రిష్ణ పెండుర్తిలో 40 ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు.  విశాఖ భూ కబ్జాలపై సిట్ నివేదిక ఎందుకు బయట పెట్టడంలేదని ఆయన ప్రశ్నించారు.

మోడీ ప్రభుత్వం ఎలాంటి వివక్షా ప్రదర్శించడం లేదని, ఈ రాష్ట్రంలో తమకు సీట్లు ఇవ్వకపోయినా అందరినీ సమదృష్టితో చూడాలన్న లక్ష్యంతోనే దాదాపు 15వేల కోట్ల రూపాయల  పెట్టుబడులతో వివిధకార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని సత్యకుమార్ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్