Friday, March 20, 2026
HomeTrending Newsబాబు వ్యాఖ్యలు దారుణం : తోపుదుర్తి

బాబు వ్యాఖ్యలు దారుణం : తోపుదుర్తి

Not fair: ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో మళ్ళీ ఫ్యాక్షన్ విష సంస్కృతికి బీజం వేసేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమలో పర్యటించిన బాబు ప్రసంగాలు చూస్తే రెచ్చగొట్టి నాలుగు ఓట్లు రాబట్టుకునేందుకు అయన ప్రయతిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.  తాదేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

బాబు రాప్తాడు సభలో తనను పదే పదే ఉన్మాదిగా సంబోధిస్తూ మాట్లాడడం దారుణమన్నారు. 2014-19 వరకూ అక్కడ ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసిందీ, తమ మూడేళ్ళ పాలనలో ఎన్ని నమోదయ్యిందీ వివరాలు ఇస్తానని, అవసరమైతే ఏబీ వెంకటేశ్వర రావు తో కానీ, డిజిపితో నైనా సరే విచారణ జరిపించుకోవచ్చని సవాల్ చేశారు.

“మీ ప్రభుత్వ హయాంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళితే నాపై దాడి చేసి మళ్ళీ నామీదే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన విషయం గుర్తు లేదా? ఎన్నికలకు కొన్ని రోజుల ముందు రాప్తాడులో గెలవడం కష్టమని తెలిసి, మా కుటుంబంలో ఒకరిని హతమార్చేందుకు పరిటాల సునీతతో కలిసి మీరు కుట్రలు చేసిన విషయం వాస్తవం కాదా?” అని చంద్రబాబును ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.

మీ ఎమ్మెల్యేకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందంటూ బాబు చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేమిటని, అంటే తనను అంతమొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా అని ప్రకాష్ రెడ్డి నిలదీశారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 72 సంవత్సరాల వయసు ఉన్న ఓ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని ప్రకాష్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు.

గతంలో ఎన్నోసార్లు ప్రైవేటు సైన్యంతో తమపై దాడి చేసినా, తాము అధికారంలోకి రాగానే తల్లీ కొడుకులకు భద్రత కల్పించామని,  ఓడిపోయిన ఉక్రోషంతో టిడిపి వారు తమపై దాడి చేసినా ప్రతిదాడులకు పాల్పడలేదని గుర్తు చేశారు. రక్తం పారిన నేలపై పేరూరు డ్యామ్ ద్వారా నీరు పారించామని వివరించారు. బాబు మళ్ళీ అక్కడ పగలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం హేయమైన చర్య అని ప్రకాష్ రెడ్డి దుయ్యబట్టారు.

Also Read : అధికారం లేకపోతే బాబు బతకలేరు: అంబటి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular