ఓబిసి వర్గాలను గుర్తించే అధికారాలను రాష్ట్రాలకు ఇవ్వడం శుభాపరిణామని వైఎస్సార్సీపీ రాజ్య సభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సంతోషం వ్యక్తం చేశారు. ఓబీసీ బిల్లుకు తాము సంపూర్ణంగా మద్దతు పలికామన్నారు. కులాల వారీగా మొత్తం జనాభాను లెక్కిస్తేనే బీసీలకు దక్కాల్సిన ప్రయోజనాలు అందుతాయని స్పష్టం చేశారు. కులాల వారీగా ఓబీసీ గణన చేపట్టాలని సుభాచంద్ర బోస్ విజ్ఞప్తి చేశారు. ఏయే కులాలు వెనుకబాటుతనంలో ఉన్నాయనే విషయమై రాష్ట్ర ప్రభుత్వాలకే అవగాహన ఉంటుందన్నారు. ఢిల్లీ లో వైఎస్సార్సీపీ ఎంపీలు ఓబీసీ బిల్లుపై మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ మెడికల్, డెంటల్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ సీట్లలో కేంద్ర ప్రభుత్వ ఓబీసీ పూల్ కోటాకు 15 శాతం కేటాయిస్తారని, గత నాలుగేళ్ళలో ఈ కోటా కింద ఆంధ్రప్రదేశ్ కు 11,027 సీట్లు దక్కాల్సి ఉండగా ఒక్కటి కూడా దక్కలేదని పిల్లి సుభాష్ గణాంకాలతో సహా వివరించారు. రాజ్యంగపరమైన హక్కు లేకపోవడంతోనే ఆ సీట్లు మనం దక్కించు కోలేకపోయామని, ఇప్పుడు ఊబీసీ బిల్లు ఆమోదంతో ఆ అడ్డంకి తొలగిందని హర్షం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో మోపిదేవి వెంకటరమణ, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్ పాల్గొన్నారు.