Thursday, April 25, 2024
HomeTrending Newsఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ సత్తా చాటింది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలనూ కైవసం చేసుకుంది. మొత్తం తొమ్మిది స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా ఐదింటిని ఏకగ్రీవంగా గెలుపొందింది.

శ్రీకాకుళం జిల్లా లో వైసీపీ అభ్యర్ధి నర్తు రామారావు 632 ఓట్లు లభించాయి. మొత్తం 752 ఓట్లు పోల్ కాగా, నర్తుకు 632, ఇండిపెండెంట్ అభ్యర్ధికి 108 ఓట్లు లభించాయి.12 ఓట్లు చెల్లలేదు.

పశ్చిమ గోదావరి జిల్లాలో  మొత్తం 1105 ఓట్లు ఉండగా 1088 పోలయ్యాయి. వైసీపీ అభ్యర్ధులు కవురు శ్రీనివాస్ కు 481;  వంకా రవీంద్రనాథ్ కు 460 లభించాయి, స్వతంత్ర అభ్యర్ధికి 120 ఓట్లు వచ్చాయి.

కర్నూలు జిల్లాలో డా. మధుసూదన్ ఘన విజయం సాధించారు. మొత్తం 1136 ఓట్లు పోల్ కాగా, వాట్లో 53 చెల్లని ఓట్లుగా గుర్తించారు. మిగిలిన 1083లో మధుసూదన్ కు 988 లభించాయి.

కాగా, తూర్పు గోదావరి జిల్లా నుంచి కుడుపూడి సత్యనారాయణ, నెల్లూరు జిల్లా నుంచి మేరుగ మురళీధర్, కడప జిల్లాలో పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, అనతపురం నుంచి మంగమ్మ, చిత్తూరు నుంచి సిపాయి సుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ స్థానాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Also Read : ముగ్గురు బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

RELATED ARTICLES

Most Popular

న్యూస్