Monday, January 20, 2025
HomeTrending Newsబెంగాల్‌ గవర్నర్‌కు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత

బెంగాల్‌ గవర్నర్‌కు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌కు కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆనంద బోస్‌పై దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘావర్గాల సమాచారంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. దీంతో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఆయనకు భద్రత కల్పించనున్నారు. ఇక నుంచి 35 నుంచి 40 మంది వరకు భద్రత సిబ్బంది గవర్నర్ సివి ఆనంద బోస్ కు రక్షణగా ఉండనున్నారు.

కేరళ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆనంద బోస్‌ గతేడాది నవంబర్‌ 23 బెంగాల్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. అంతకు మందు ఆయన వెస్ట్‌ బెంగాల్‌ ఎన్నికల అనంతరం జరిగిన హింసపై నియమించిన విచారణ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. అయితే ఆయనపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ వర్గాలు నివేదిక ఇవ్వడంతో కేంద్ర హోం శాఖ భద్రతను కట్టుదిట్టం చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్