Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్The Ashes: జాక్ డబుల్ సెంచరీ మిస్ - ఇంగ్లాండ్ లీడ్

The Ashes: జాక్ డబుల్ సెంచరీ మిస్ – ఇంగ్లాండ్ లీడ్

యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ ధీటైన జవాబిస్తోంది.  తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు కోల్పోయి 384  పరుగులు చేసింది. తొలి రోజు 299 పరుగులకు ఎనిమిది వికెట్ల వద్ద నేటి రెండోరోజు ఆట మొదలు పెట్టిన ఆస్ట్రేలియా 317 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మిచెల్ స్టార్క్-36 పరుగులతో నాటౌట్ గా నిలవగా, కెప్టెన్ కమ్మిన్స్(1); హాజెల్ వుడ్ (4) త్వరగా ఔటయ్యారు.  క్రిస్ ఓక్స్ 5; బ్రాడ్ 2; అండర్సన్, మార్క్ వుడ్, మొయీన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఇంగ్లాండ్ 9 పరుగుల వద్ద ఓపెనర్ బెన్ డకెట్ (1) వికెట్ కోల్పోయింది. రెండో వికెట్ కు జాక్ క్రాలే-మోయిన్ అలీ 121 పరుగులు జోడించారు. అలీ 54రన్స్ చేసి ఔటయ్యాడు. మూడో వికెట్ కు జో రూట్ తో కలిసి 206 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జాక్ (189) డబుల్ సెంచరీ కి 11 పరుగుల దూరంలో గ్రీన్ బౌలింగ్ లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. జో రూట్ కూడా 84 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు.  హ్యారీ బ్రూక్ -14;  బెన్ స్టోక్స్-24 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 67 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్ కొనసాగుతోంది.

ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు; హాజెల్ వుడ్, కామెరూన్ గ్రీన్ చెరో వికెట్ పడగొట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular