Created History: తెలంగాణా బాక్సర్ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టర్కీలోని ఇస్తాంబులో జరుగుతోన్న విమెన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్స్- 2022లో 52 కిలోల విభాగంలో విజేతగా నిలిచింది. నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో థాయ్ లాండ్ కు చెందిన జిట్ పాంగ్ జుటామస్ పై విజయం సాధించింది.
జరీన్ 14 జూన్ 1996 న తెలంగాణలోని నిజామాబాద్‌లో ఎండి జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా దంపతులకు జన్మించింది. 13 సంవత్సరాల వయసులోనే జరీన్ బాక్సింగ్ ఆడటం ప్రారంభించింది. ఆమె బాక్సింగ్ ప్రయాణానికి తండ్రి పూర్తి మద్దతు ఇచ్చాడు.జరీన్ తరచుగా బాక్సర్ మేరీ కోమ్ ను తన స్ఫూర్తి ప్రదాతగా భావించేది. హైదరాబాద్‌లోని ఏవీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో జలంధర్‌లో జరిగిన అఖిల భారత అంతర విశ్వవిద్యాలయ పోటీల్లో ఆమె బెస్ట్ బాక్సర్ ఛాంపియన్ షిప్ సాధించింది. 2009 లో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐవీ రావు ఆధ్వర్యంలో శిక్షణ పొందటానికి జరీన్‌ను విశాఖపట్నంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చేర్చుకుంది. ఒక సంవత్సరం తరువాత ఆమె 2010 లో ఈరోడ్‌లో జరిగిన నేషనల్స్‌లో ఆమెను ‘గోల్డెన్ బెస్ట్ బాక్సర్‌గా’ ప్రకటించారు.
మరోవైపు, నిన్న జరిగిన సెమీఫైనల్స్ లో 57 కిలోల విభాగంలో మనీషా; 63 కిలోల విభాగంలో పర్వీన్ లు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించారు.
అంతకుముందు క్వార్టర్ ఫైనల్స్ లో పూజా రాణి, నీతూ, ఆనామిక, జాస్మిన్, నందిని ఓటమి పాలయ్యారు.