Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్ICC ODI Qualifier Matches: జింబాబ్వే, విండీస్ విజయం

ICC ODI Qualifier Matches: జింబాబ్వే, విండీస్ విజయం

ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ 2023 క్వాలిఫైర్ మ్యాచ్ లు నేడు మొదలయ్యాయి.  మొదటి మ్యాచ్ లో నేపాల్ పై జింబాబ్వే 8 వికెట్ల తేడాతో;  రెండో మ్యాచ్ లో అమెరికాపై వెస్టిండీస్ 39 పరుగులతో విజయం సాధించాయి.

జింబాబ్వే లోని హరారే  స్పోర్ట్స్  క్లబ్ వేదికగా నేపాల్- జింబాబ్వే జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకుంది. నేపాల్ తొలి వికెట్ కు 171 రన్స్ చేసింది. కుశాల్  భుర్టెల్- 99; ఆసిఫ్ షేక్-66; కుశాల్ మెల్లా-41; కెప్టెన్ రోహిత్ పాడెల్-31 పరుగులతో రాణించారు. నిర్ణీత 50ఓవర్లలో  8వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది.

జింబాబ్వే బౌలర్లలో నగరవ-4; మసకద్జా-2; చాటారా, ముజరబ్బానీ చెరో వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత 45 పరుగులకు జింబాబ్వే తొలి వికెట్ (గంబీ-25)  కోల్పోయింది.  ఫస్ట్ డౌన్ లో వచ్చిన వెస్లీ  మధేవెరే 32 పరుగులు చేసి జట్టు స్కోరు 127వద్ద వెనుదిరిగాడు. కెప్టెన్ క్రేగ్ ఎర్విన్-121 (128 బంతుల్లో 15 ఫోర్లు. 1 సిక్సర్ )- సీన్ విలియమ్స్ 70 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ తో 102 రన్స్ తో అజేయంగా నిలిచి 44.1 ఓవర్లలోనే విజయం అందించారు.

ఎర్విన్-విలియమ్స్ మూడో వికెట్ కు అజేయమైన 164 పరుగులు జోడించడం విశేషం.

క్రేగ్ ఎర్విన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

***

విండీస్- అమెరికా మధ్య జరిగిన మ్యాచ్ లో… టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పయిన విండీస్ కష్టాల్లో పడింది. మూడో వికెట్ కు జేమ్స్ ఛార్లెస్-కెప్టెన్ షాయ్ హోప్ లు 115 రన్స్ జోడించారు. ఛార్లెస్-66; హోప్-54 స్కోరు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత నికోలస్ పూరన్-43; రోస్టన్ ఛేస్-55; హోల్డర్-56 పరుగులతో రాణించారు. 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అమెరికా బౌలర్లలో నేట్రావాల్కర్, కైల్ ఫిలిప్, స్టీవెన్ టేలర్ తలా 3;కెంజిగే ఒక వికెట్ పడగొట్టారు.

అమెరికా 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. గజానంద్ సింగ్ సెంచరీ (101) చేసి నాటౌట్ గా నిలిచాడు. మిగిలిన వారు విఫలం కావడంతో 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 258 పరుగులే చేసింది.

విండీస్ బౌలర్లలో కేల్ మేయర్స్,  అల్జారీ జోసెఫ్ చెరో 2; హోల్డర్, ఛేజ్ చెరో వికెట్ సాధించారు.

హోల్డర్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్